రామాయణ విశేషములు 189 శౌర్యములో లక్ష్మణుడు రాముని కేమాత్రమును తీసిపోనివాడు. రామునైనను ఇతరులు తేరిపార జూడగలరేమో, లక్ష్మణునికి కోపము వచ్చెనా అతని నెదిరించుట కష్టము. భరతుడు అతనికి తన తల్లి లక్షణాలు బాగా తెలియును. “ఆత్మ కామా, సదా చండీ, క్రోధనా ప్రాజ్ఞమానినీ” (ఆయో. 68-10) అని మొదలే అన్నాడు. అయోధ్యకు వచ్చి సంగతులు కను గొన్నాడు. తల్లిపై మండిపడినాడు. "నిన్ను చంపివేయవలెను. కాని రాముడు కోపపడునని ఊరకున్నాను". అని అన్నాడు. ప్రజలకు మొదలతనిపై మంచి భావము లేకుండెను. కాని అతని యుద్దేశములు విన్న తర్వాత వారతనిని గౌరవించిరి. అరణ్యమందలి ఋషులును అతనిని మెచ్చుకొనిరి. రాము డీతనిని ప్రథమసమాగమములోనే కౌగిలించుకొని తొడ పై కూర్చుండబెట్టుకొని గాఢముగా ప్రేమను ప్రకటించెను. రాముడు తిరిగివచ్చుటకై అతడు చేయవలసినన్ని ప్రయత్నాలు చేసెను. కడప కడ్డము పండుకొనెను. లాభము లేకపోయెను. తుదకు రాముని పాదుకలు తలపై ధరించి మహావ్యసనముతో వెళ్ళెను. 14 ఏండ్లు అయోధ్యను ప్రవేశించక పోయెను. తానును తాపసియై నందిగ్రామములో రాముని పాదుకలవద్ద కూర్చుండి ధర్మపరిపాలనము చేసెను. శ త్రు ఘ్నుడు అప్రసిద్ధుడు. మంచివాడే కాని వీరుడుకాడు. వ్యపదిష్టుడుకాడు. ఎటులో మంథర పై కోపమువచ్చి ఆమెను బాధించి చంపుటకై లేచెను. అటుతర్వాత అతని ముచ్చట మనకు ఏమియు తెలియదు. యథాజ్ఞా సయతి రాజా (జో హుకుం సర్కార్) ఆనునట్టి వ్యక్తిగా కానవచ్చు చున్నాడు.
పుట:రామాయణ విశేషములు.pdf/239
Appearance