Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 177 నాట్యము చేయుచు విలాసముగా పూలను చల్లు నటకునివలె ఈ చిత్రకూటములోని వృక్షములు గాలిచే పూలను మందాకినిపై విడుచు చున్నవి. (అయో. 95–8) చలికాలమందు సూర్యుడు దక్షిణగామి యగుటచేత ఉత్తరదిశ తిలకములేని శ్రీవలె కాంతి హీనయై యున్నది. (ఆర. 16-8) చలికాలములో పున్న మనాడుకూడా చంద్రునివెన్నెల తుషార మలినమై ఆతపశ్యామయైన సీతవలె ప్రకాశము తగ్గియున్నది. (అర. 16-14) శూరులు కానివారు యుద్ధములో జొరబడుటకు వెనుకముందాడి నట్లు ఈ పక్షులు శీతజలములను తాకుటకు భయపడుచున్నవి. (ఆర. 16-22) వసంతరువునందు అంతటను నిప్పంటుకొన్నదా అన్నట్లు మోదుగుపూలు వికసించియున్నవి. (ఆయో. 56-6) వానకాలమందు పర్వతములు మేఘములచే గప్పబడి జలధారలు కల సెలయేరులతో నొప్పి గుహలందు గాలిచొచ్చి ధ్వనించుచుండుట వలన కృష్ణాజినములు తాల్చి జందెములను ధరించి వేదాధ్యయనము చేయుచు (ఋషివలె) ఒప్పుచున్నది, (కి. 28-10) నల్లని మేఘాలలో చలించుచున్న మెఱుపు, రావణుని తొడపై పెనఁగులాడుచున్న విడిపించుకొనుటకై నున్నది. (కి. 28–12) శోచనీయయగు సీతవలె పచ్చని బయళ్లలో చిన్న యారుద్ర పురుగులు నిండియున్నవి. చిలుకవన్నె వంటి చీరపై లక్కచిత్తరువులు వ్రాసిన చీరను కట్టిన స్త్రీవలె ఆ బయలు ఒప్పుచున్నది. (కి. 28-24) RV-12