178 రామాయణ విశేషములు పాఖ్యానము, అహల్యాకథ, విశ్వామిత్ర చరిత్ర, ఋషి కుమార వధాఖ్యా నము, ఇట్టివి. మరికొన్ని కలవు. కాని యవి మూలకథకు సంబంధించి నవై యున్నవి. పైగా ఇవి చిన్న గుటచేత ప్రధాన విషయమునకు భంగము కలిగింపవు. కథావస్తువు యొక్క యైక్యత (Unity of plot) కావ్యానికి జీవము వంటిది. బహు సంస్కృతాంధ్ర కావ్యాలో అష్టాదశ వర్ణనలు కలవు, ఇవన్నియు వాల్మీకిలో లేవు. అయినను రామాయణము ఇటీవల ఆలం కారికుల నిబంధనల ప్రకారము మహాకావ్యము కాజాలదని చెప్ప సాహ సించువారు కానరారు. మరి కావ్యాలలోని వర్ణలను కూడా ఒకేవిధ మైనట్టివి. పలుమారు పాఠకులను విసిగించును. ఉత్ప్రేక్షాతిశయోక్తుల కవి పుట్టినిండ్లు. కాని వాల్మీకి సహజకవి, ప్రకృతి కుమారుడు, ఉప మానములకు ఆది పురుషుడు, రమ్యమగు వర్ణనలకు నిధి. రామాయణములో అయోధ్యావర్ణన (బాల. సర్గ 5) రాజవర్ణన (బాల. 6) అమాత్య వర్ణన (బా. 7) అరాజక దురవస్థావర్ణన (ఆయో. 67) చిత్రకూట వర్ణన (అయో. 94) వసంతము (ఆయో. 56) మందా కినీ వర్ణన (అయో. 95) హేమంతము (ఆర.16) రామపరితాపము (ఆర. 60) రామవిలాపము (ఆర.82) ప్రావృట్కాలము (కి.28) శరత్కాలము (కి. 30) పుష్పక వర్ణనము (సు. 8) మధువన క్రీడలు (సు. 61, 62) అను వర్ణనలు ముఖ్యమైనవి. అరణ్య వర్ణన పలుతావులలో సుందరముగా కావింపబడినది. (ఆర. 11, కి. 1; కి. 27) పై వర్ణనలలో కొన్ని యుదాహరణార్థము ఈ క్రింద ఎత్తి చూపింపబడుచున్నవి. "ఈ చిత్రకూట పర్వతము సెలయేరుల చేతను, ఊటల చేతను, మదపు టేనుగువలె ప్రకాశించుచున్నది. (అయో. 94-18)
పుట:రామాయణ విశేషములు.pdf/226
Appearance