Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xx

ప్రయుక్త శ్రాద్ధే నియుక్తస్య నమత్స్య మాంసభక్షణో దోషావహః” అని చెప్పుటచే నూహ్యమగుచున్నది. కేతన మహాకవి తన విజ్ఞానేశ్వరీ యాంధ్రీకరణమున మూలమునందుండిన 'మహోక్షం వా మహాజం వా శ్రోత్రి యాయప్రకల్పయేత్" అను శ్లోకము నాంధ్రీకరింపలేదు. కాని యితరములగు “నంజుడు" నములుటను గూర్చిన శ్లోకములను యథా మాతృకగా నాంధ్రీకరించెను.

మఱియు సత్రములలో బ్రాహ్మణుల భోజనమునకును ఈశ్వర నైవేద్యమునకును నంజుడు నుపయోగించుచుండినట్లు South Indian Inscriptions, 4th, 5th volumes లో పెక్కు శాసనములున్నవి.

ఇప్పుడును పంచగౌడులలో మత్స్యమాంసభక్షణము దోషము కాదు. మహామహోపాధ్యాయులైన మిథిలదేశపు పండితులును, వేదవేత్త లైన ఉత్కళదేశపు వైదికులును మత్స్యమాంసభక్షణమును జేయుటను జూచి యొక యాంధ్రపండితు డిట్లనినాఁడు:


శ్లో॥ అవతారత్రయం విష్ణోః మైథిలైః కబళీకృతం.

శ్లో॥ మత్స్యమాంస భక్షణం, కక్షకేశరక్షణం ఓఢ్రజాతి లక్షణం.

అని విచిత్రముగాఁ జెప్పియున్నాడు. పర్లాకిమిడి కళాశాల యం దుపాధ్యాయుడును నాకు మిత్రుడునగు నొక వైదిక ఓడ్ర బ్రాహ్మణుని వారియందుగల మత్స్యమాంస భక్షణమును గూర్చి నేను బ్రశ్నింపగా పొలుసుగల మత్స్యములను జాంగలములగు “యిర్రి, దుప్పి, కణుసు" అనువాని మాంసములను మాలో పెక్కండ్రు భుజించుచుందురని జెప్పియున్నాడు. మత్స్యమాంసభక్షణము చేయుటచే హిందువు బలమును వృద్ధిచేయుటకు హేతువని బ్రహ్మసమాజ మతస్థాపకుడగు