66 రామాయణ విశేషములు 153 లక్షణాలే కాని ఏదోకొంతయైన స్వేచ్ఛగల జాతిలక్షణాలు కానేకావుకదా! అయితే శూద్రులు కైబరు కనుమలవద్ద నుండిరనుట కేమి ప్రమాణము? అలెగ్జాండరు దాడి చేసినపుడతనితో యుద్ధము చేసిన వీర జాతులలో “ క్షుద్రక ” అను వర్గమొకటి. దానినే గ్రీకులు (ovydrakai) ఆక్సిద్రకై అనిరి. మరికొందరు వారిని శద్రీ (Sadrae) అనిరి. మరికొందరు గ్రీకు చరిత్రకారులు వారిని హిద్రకీ (Hydrakes) అనిరి. జీలం, రావీ నదుల మధ్య నుండిన అలెగ్జాండరు కాలపు వీరజాతిపేరు గ్రీకులో మాల్లాయి (Malloi). రావీ సల్లెజ్ నదులమధ్య నుండిన వీరజాతి పేరు అక్షుద్రకీ (ovydrakai). ఈ రెండు జాతులును ఏక జాతులనియు, మహావీరు లనియు, అలెగ్జాండరు సైన్యాన్ని ప్రతిఘటించిన వీరజాతియనియు గ్రీకు చరిత్రకారులు వ్రాసిరి. అలెగ్జాండరు కన్న ముందు ఇంచుమించు అతనికి వేయియేండ్లకు ముందు పై ముద్రక వీరజాతి ఆర్యులతో నిరం తరము తమయొక్కయు తమ యాదినివాసము యొక్కయు స్వాతంత్ర్య మునకె పోరాడి తుదకోడి యుందురు. అలెగ్జాండరు మల్లాయిలను క్షుద్రకులను ఓడించి వారినెట్లు వరుసబెట్టి చంపించెనో గెలిచిన ప్రాచీనార్యులును క్షుద్రకులను ఘోరముగా బాధించియుందురు. తుదకు వారిని బానిసలుగా చేసిరి. వారిని నాల్గవ వర్ణముగా తమ సేవకులనుగా నేర్పాటు చేసుకొనిరి. పర్ష్య ప్రాంతపు ప్రాచీన దహ్య (Dahae) (దస్య) జాతినెట్లు గెలిచి బానిసలుగా చేసియుండిరో సింధునదీ ప్రాంతాల లోని క్షుద్రకులను తర్వాతికాలములో గెలిచి బానిసలుగా చేసికొనిరనిన సత్యదూరము కానేరదు. క్షుద్రకులే తర్వాతి శాస్త్రపురాణాలలోని శూద్రక, శూద్రజాతివారైరని తలతును. తర్వాత యార్యులు గంగా ప్రాంతము, వింధ్య ప్రాంతము, దక్షిణా పథము, వంగ ప్రాంతమును ఆక్రమించుకొనినప్పు డక్కడి కార్మిక వర్గములను తమకు పసందుకాని వారిని, తమ్మెదిరించినవారిని, తమ యాచారములను స్వీకరింపనివారిని శూద్రజాతిలో చేర్చినట్లూహింతును. ఈ శూద్ర చర్చ యంతయు నా యూహయే. తప్పో ఒప్పో తోచినది వ్రాయనై నది. రామునికాలమందలి ఆశ్రమజీవనమును గురించి విపులముగా వ్రాయవలసిన అవసరము కానవచ్చుచున్నది. అయినను విషయవిస్త
పుట:రామాయణ విశేషములు.pdf/203
Appearance