152 రామాయణ విశేషములు ఈ మంత్రాలిరికినవి. ఎట్లన "బ్రాహ్మణోస్య ముఖమాసీత్ పద్భ్యాం శూద్రోజాయత" అనిన వెంటనే అదే ఊపులోనే ఇంద్రా గ్నులు విరాట్పురుషముఖమునుండి, భూమి పాదమునుండియు జనించే నన్నారు.” (సెన్సస్ రిపోర్టు 1871 సం1. పు. 2-30). ర మేశ చంద్ర దత్తుగారు పదవమండల మంతయు తర్వాతికాలమున అతికించినదే అని భావించినారు. వారనేక యుపపత్తులతో నిరూపించి మరల నిట్లన్నార రు: “పదవ మండలములో బహు ఋక్కులకు కర్తలు దేవతలట! ఇదొక్కటే ప్రక్షి ప్రకారుల దొంగతనమును పట్టించును. (ఏకాషంట్ ఇండియా పు. 38). కోల్బూకు ఇట్లే నిర్ణయించెను. “ఇతర సూక్తాలు మోటుగాను ఈ సూక్తము శ్రావ్యముగాను రచించుట దీని అర్వాచీనత్వమును పట్టిం చును" అనియనెను. వెబర్, మ్యూర్, మరి యితరులందరును ఈ సూక్త మాధునిక యనియే తేల్చిరి. ఋగ్వేదమఁదుగూడ స్వార్థులు హ సక్షేపము చేసిన యేది దిక్కు? కంచెయే చేనుమేసిన యెట్లు? ఈ చర్చయట్లుండనిండు. శూద్రపదమునకు చారిత్రకాధార మేమో కనుగొందము. శూద్రులు కాళ్లలో పుట్టినవారు కారు. ప్రాచీనకాలమందు ఆర్యులు సింధూదేశములోనికి ప్రవేశించిననాడు అచ్చట నుండిన ఆదిమనివాసులగు “శూద్రులు" అను జనులతో అతి ఘోరముగా పోరాడవలసి వచ్చెను. ఆ శూద్రవర్గమువారు మహావీరులు. కాని యార్యులవద్ద మేలైన యాయుధాలుండెను. తుదకు శూద్రులోడి బానిసలైరి. అందుచేతనే మనుస్మృత్యాదులలో శూద్రులకు హక్కు లేకుండుట. వారెల్లప్పటికి త్రైవర్ణికుల సేవచేయుట, వారు సంపాదించిన దంతయు బ్రాహ్మణాదులకు చెందుట, వారు పై వారితో సింహాసనమందు కూర్చునిన పిర్రలు కోయుట, "పద్యుహవాయ ఏతత్ శ్మశానో" శూద్రః అనుట, "శూద్రాయమతిం నదద్యాత్" అనుట, వేదముచ్చరించిన “జిహ్వాచ్ఛేదం కారయేత్" అనుట. వేద వాదము వినిన "త్రపుజతుభ్యం కర్ణాని పూరయేత్" ఆనుట, ఇవన్నియు సంపూర్ణముగా బానిసల
పుట:రామాయణ విశేషములు.pdf/202
Appearance