Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 143 మానమగు 'మయవాస్తువు' అను శిల్పగ్రంథమును రచించెననియు మరి మొత్తానికి “మయుడు” అనార్యుడు, మహా కొందరి విశ్వాసము. శిల్పవేత్త. ఆయోధ్యలో ఏడంతస్థుల వరకు సౌధరాజములను నిర్మించి యుండిరనిస గృహనిర్మాణ శిల్పమెంతయో అభివృద్ధిపొంది యుండ వలెను. రాముడు శిల్పశాస్త్రప్రకారము కుటీరము నిర్మించుకొనెను. అదే శాస్త్రమును అనుసరించియే వాస్తుశాంతికై జింకను బలి యిచ్చెను. బాటలు అనగా రోడ్లు నిర్మించు 'ఇంజనీయర్లు' ఉండిరి. చారముతో కొలత పట్టువారు, త్రవ్వువారు, కూలీలు కర్మాంతికులు, శిల్పుల పర్యవేక్షకులు మేస్త్రీలు, వారిని రామాయణమందు స్థపతులు అని యన్నారు, వడ్లవారు వార్ధకులు, బాటలు వేయువారు మార్గణులు చెట్లను నరుకువారు వృక్షతక్షకులు, బావులను త్రవ్వువారు కూప కారులు, సున్నము గచ్చుపనిచేయువారు సుధాకారులు, మేదరవారు వంశకర్మకులు, గడ్డపారలలోను, రంపములతోను పనిచేయువారు- ఇట్టి వృత్తులవారు తండోపతండములుగా దేశమందు నిండియుండిరి. అయో. 80-1 నుండి 7 వరకు నీలుడు ఒక గొప్ప నిర్మాణ 7 . శిల్పవేత్త ఇంజనీయర్. అతని యాదేశప్రకారమే లంకకు వారధి కట్టబడెను. నీలుని తండ్రి కూడా అట్టివాడే. (యుద్ధ 22-45 సేతు నిర్మాణ ణ విశేషాల కీ సర్గను చూడుడు) ఇదంతయు వాస్తుశాస్త్ర సంబంధ మగు చర్చ. ఇక సాముద్రిక శాస్త్రమును గురించి చర్చింతము. జనులకు సాముద్రికమందు మంచి విశ్వాసముండెను. రామాయణ కాలమందు అనగా క్రీ. పూ. 2500 నాడు సాముద్రిక ముండెనా యని సంశయింప బనిలేదు. ఈ శాస్త్రము జ్యోతిషముతో లంకె వేసుకొని యున్నట్టిది. సాముద్రికమును మొట్ట మొదట హిందువులే కనిపెట్టిరి. రాను రాను