142 రామాయణ విశేషములు గ్రహాలు రోహిణిని వీక్షించుట లోకానర్థకమన్నాడు. (ఆర.46-5). బుధుడు రోహిణిని పొందితే జగత్పీడ కలుగు నన్నాడు. (యుద్ధ. 103-30). 'నా జన్మ నక్షత్రాన్ని సూర్యాంగారక రాహువు లాక్రమించి నవి' అని దశరథుడు విచారపడినాడు. (అయో. 4-18). శుభదిన శుభ నక్షత్రయోగమునుచూచి ప్రయాణముగాని ఉద్యమములను గాని సాగించు చుండిరి. (యుద్ధ. 4-8). ఇట్టివెన్నైనను కలవు ఈనాడు టెలిస్కోపు యంత్రాలద్వారా చూచి సూర్యునిలో మచ్చలు (Sun Spots) ఉన్నవని తేల్చినారు. ఇంతమాత్రము ఆనాడే వాల్మీకికి తెలియక పోలేదు. "ఆదిత్యే విమలే నీలం లక్ష్మ లక్ష్మణ దృశ్యతే" (యుద్ధ 28-9) "లక్ష్మణా! సూర్యునిలో నల్లనిమచ్చ కనబడుచున్నది సుమా!” అని రామునిచే వాల్మీకి చెప్పించినాడు. ఆ కాలమందు శిల్పనిర్మాణకుశలు లుండిరి. మయులను జాతి శిల్పవే త్తల జాతిగా నుండెను. వారి శిల్ప మొక మాయవలె నుండెను. "మాయే వ మయనిర్మితా" (యుద్ధ. 12-14) వ (12-14) ఈ మయు లెవ్వరు? వీరి సంతతి తర్వాత బహు పురాణాలలో కాని ప్రాచీన చరిత్రలందుకాని కానరాదు. మహాభారతమం దొక మయుడు వచ్చెను. అతడు నిర్మించిన “మయసభ” కౌరవయుద్ధాని కొక కారణ మయ్యెను. అతడు ఖాండవవనమందలి అనార్య నాగజాతిగా అందు నిరూపితుడైనాడు. ఈనాడు కొందరు విమర్శకులు మెక్సికో అమెరికా ఖండము లోని సుప్రసిద్ధమగు మయజాతివారే యీ మన మహాభారత మయునిజాతివా రని తేల్చుచున్నారు. "హిందూ అమెరికా" గ్రంథము వ్రాసిన చమన్లాల్గారు మెక్సికోకు హిందువులు అతి ప్రాచీనకాలములో వలసపోయి ఆ దేశమం దుండిపోయిరనియు, అందుచేత మయులు ఒక కాలమందలి భారతీయులనియు వాదించినారు. మయ బ్రహ్మ అను దేవజాతివా డొక డుండెననియు, అతడే ఇపుడు లభ్య అను
పుట:రామాయణ విశేషములు.pdf/192
స్వరూపం