Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 61


ఈ విధముగా ఆథర్వానుడే జరుథుసుడు. వేనుడే రామ చంద్రుడు. అధర్వానుడు లేక జరధుస్తుడు అసురులకు ముఖ్యుడు. వేనుడు లేక రాముడు దేవతలకు ముఖ్యుడు. జర థుస్తుడు మొదటివాడు. అతడే పరశురాముడు. రాముడు తర్వాతివాడు. అధర్వవేదమ ను బ్రహ్మవేద మనియు, క్షత్రవేద మనియు పూర్వము వ్యవహరించు చుండిరి. అందుచేతనే రామాయణ ఆదిపర్వములో(65-8) ఇట్లు వ్రాసిరి.

"క్షత్రవేదవిదాం శ్రేష్ఠ బ్రహ్మ వేదవిదామపి బ్రహ్మపుత్రో వసిష్ఠా మామేవం వదతు దేవతాః”

అథర్వవేదము క్రీ. పూ. 2000 నాడు రచింపబడియుండును. కావున జరథుస్త్రుడు ఆ కాలమువాడు. రాముడు అతని కించుక తర్వాతి వాడు.

ఇది జతీంద్రమోహన్ ఛటర్జీగారి వాద సారాంశము. అతని తర్కము భావకశ్మలము (Confusion) తో కూడియున్నది. భావప్రకో పము (thought provoking) కలిగించు భావాలను వెదజల్లినాడు. ఇప్పు డతని తర్కము సరియగునా కాదా అను వాదమును పెంచుకో నవసరము లేదు. అతని అభిప్రాయములో శ్రీరాముని కాలము ఇంచుమించు క్రీ.పూ. 2000 ఏండ్లనాటిది అనుట గమనింపదగినది. ఋగ్వేదములోని “రామ” “అసుర” పదాలతో కూడిన మంత్రము మాత్రము ( శ్రీ పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారును, ఛటర్జీగారును పరస్పర విరుద్ధార ముల నిచ్చినను) నా కేమియు నర్థము కాలేదనియే చెప్పుకొనవలసి యున్నది.

అయితే మరొక విషయము గమనించదగినదై యున్నది. హర విలాస శారదాగారు తమ హిందూసుపీరియారిటీ అను ఆంగ్ల గ్రంథములో ఇట్లు వ్రాసినారు :