Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

రామాయణ విశేషములు

అసురులకు ముఖ్యదేవుడు వరుణుడు.


“అహం రాజా వరుణ మహ్యంతాని అసుర్యాణి ప్రథమా ధారయంతే".
                                                                         ఋగ్వే. 4-42-2.

అసురులే పితృదేవతలు.

పితాయజ్ఞానాం అసురోపశ్చితాం. ఋగ్వేద. 3-3-4.


పారశీకుల (ప్రాచీన ఈరానీల) కు మతకర్త జరథుస్త్రుడు. అతడు ప్రకాశింపజేసిన “ఆహురమజధా" అను గ్రంథములో అహుర మజధాకు (అసురమేధ) పర్యాయపదాలలో వరుణుడు అనునదొక్కటియై అతని శతనామావళిలో 44 వ పేరుగా పేర్కొనబడినది. మజధా (Mazda)మేధా అను వైదిక పదమనుటకు ప్రమాణము——


“సుయుగ్ వహంతి ప్రతివాంబుతేన, ఊర్ధ్వాభవంతి పితరేవ మేధాః" ఋగ్వేద. 3-95-2

భార్గవులు వారుణపూజకులు.

"భార్గవా వారుణా స్సర్వే యేషాం వంశామహానపి”
                                             శాంతి. 85-129.


అధర్వవేదానికి భృగ్వంగిరస అను పేరు కలదు. గోపథ బ్రాహ్మణములో ఇట్లున్నది.


"ఏతద్వై భూయదిష్టం బ్రహ్మయద్ భృగ్వంగిరసః.
                                                 1-3-4 మరియు 1-2-18.


అథర్వవేదములో భృగుసంహితకు సంబంధించిన ఖిల భాగ మునకు ఆథర్వానుడు ద్రష్ట, (భృగు, అథర్వ అను పేరు లొకటే అనుట) అందుకు ప్రమాణము--


“అధర్వాంగిరసో నామవేదేస్మిన్వై భవిష్యతి”. ఉద్యోగ-18,7.