పుట:రామమోహన నాటకము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామమోహననాటకము


చేతమ్ములోపలఁ • జితశల్ వెదచల్లు
      శారదపూర్ణిమా * చంద్రుఁ డెవఁడు
గీ.మత్తమతి వణికించు హి • మంతుఁ డెవఁడు
  చి దోషములను రాల్చు • శిశిరుఁ డెవఁడు
  అతఁడు సద్గుణ మూర్తి కృ • పానువర్తి
  సర్వనుతకీర్తి లోకైక • చక్రవర్తి.
సీ. జీవకోటుల కెల్లఁ * జిత్రతరంబులౌ
    తనువు లోసం గెడు • తండ్రి యేవఁడు
జీవనాధారమై • చెట్లు నాహారముల్
      దయ నోడఁగూ ర్చెడు • తల్లి యెవఁడు
వెలుపల లోపల*వెలుఁగుచు నాత్మలో
       జ్ఞానంబు గూర్చు నా • చార్యుఁ డెవఁడు
నిఖిలసంతాపముల్ * నెమ్మితోఁ జిల్లార్చు
       నానందమయుఁ డై న | యా పుఁ డెవ్వడు
గీ. వింతగా యోగి రాజహ్ళ • ద్వీథు లందు
    సతము నాహ్యాళి వెడలెడు * స్వామి యెవ్వడు
    అతఁడు సద్గుణమూర్తి కృ • పానువర్తి.
    సర్వనుతకీర్తి. లో కేక • చక్రవర్తి.

సూ...ఆహా ! నీగానమహిమ ! భక్తిరసపూరిత మైన రామ మోహనుని యుపన్యాసమువలె సభౌసనుల నందఱిని భక్తి పరవశులనుగాఁ జేసినై చినది.