పుట:రామమోహన నాటకము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ మోహన నాటకము,

ప్రథమాంకము.

________________


౧ వ రంగము–-రాధానగరము నందలి యుద్యానవనము. [అ నేకులు ఎదుట నిలబడి శ్రద్ధతో వినుచుండఁగా రామ మోహనుఁ డుపన్యసించుచున్నాఁడు.]


రామ– అఖండ సామా, జ్యేక ధురంధరుం డగుపర మేశ్వరుని యనుంగుబిడ్డలారా! మదీయసోదరులారా ! లేశ మైనను. : స్వార్థపరత్వము లేక కేవలము పరమార్థముజు కే తమ యావజ్జీవమును సమర్పించిన ఋషిసత్తములు, పర మేశ్వర విషయ మైనతమయ మూల్యానుభవముల నుపనిషత్తుల రూపమున మనకుఁ బ్రసాదించియున్న వారు. పొనిని శ్రద్దతోఁ బఠించి వానియర్థమును గ్రహించి తదనుసారముగ మన ము పవరించినఁగాని యాఋషిఋణమునుండి మనము విముక్తులము గాఁ జాలము. ఈ నాలుగుసంవత్సరములుగ నేను వారణాసిలోఁ బఠించి గ్రహించినయుపనిషత్సారమును నాయనుభవమును మీయెదుటఁ బెట్టుచున్నాను. సావధాన చిత్తుల రై చిత్త గింపుఁడు.