పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36 రాధికాసాంత్వనము



చ. భువిఁ బథికాళి యాత్రలకుఁ బోవఁగ నైష్ఠికవిప్రసంఘముల్
జవమున లేచి తానములు సల్ప రతాంతరసుప్తదంపతుల్
గవిసి రమింప వేళ యిది గాదె యటంచుఁ ద్రిభంగుల న్నెరా
హవణికె నుగ్గడించెఁ జరణాయుధబోధకయూధ ముద్ధతిన్. 132

ఉ. అంతట దిగ్గునఁ బరుపు నంటక లేచి పయంట దిద్దుచున్
వంతను గొంత దాచి బలవంతపుహాయి రవంత పూని చె
ల్మింతులు చెంతలం బిలువ కేగిన దేమొ యటంచు నల్క రాఁ
గంతునితండ్రిని న్గదియఁగాఁ జని రాధిక తల్పు తట్టినన్. 133

తే. [1]చేరి యందాఁక వారు చౌశీతిబంధ
[2]గతులఁ బెనఁగి చాలక పునా రతులఁ గలసి
బడలికలు దీఱ నొక్కింత పవ్వళించి
మదవతీకృష్ణు లప్పుడు నిదుర లేచి. 134

సీ. మిసిమి చెక్కు-లఁ దమ్మరసము నాథుఁడు పెంపఁ
బికవాణిమోవి కాటుకను బెంపఁ
జెదరిన ముంగురుల్ శ్రీనివాసుఁడు దిద్దఁ
గాంత జారినతిలకంబు దిద్ద
నలగోరువంకల నతఁడు కుంకుమ నించ
గలికి పల్లంటికిఁ గఫుర ముంచఁ
గప్పు పెన్నెరికొప్పు కాంతుఁ డల్లనఁ బాపఁ
జెలియ హారావళుల్ చిక్కుఁ బాపఁ
తే. జుట్టి సగమాకు నోటికి సుదతి యొసఁగ
మరలిమురవైరి కొఱికిన మడుపులొసఁగ
నట్టియెడ రాధకరకంకణాళి ఘల్లు
రనఁగ వినె నుల్లములు ఝల్లుమనఁగ నులికి. 186

  1. చేరి యందాఁకఁ బెనఁగు చౌశీతిబంధ [మూ ]
  2. రతులుచాలక మతి పునారతులఁగలసి [మూ.]