పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

రాజవాహనవిజయము

గోపంపు పాపోసులు = ఆర్ద్రపురుగువంటి పైజార్లు. వలివంపు = పలచనైన. అంగార = బొగ్గుమసి. అక్షీణ = తక్కువగాని. హేజీబు = మంత్రులు. సాహేబు = ప్రభువు, నగరి = సేనాస్థానము.

క.

వచ్చిన మంత్రుల నృపతివి
యచ్చరనాయకు ననుజ్ఞ నవసర సచివుల్
చెచ్చెర హుజూరునకుఁ బిల
వచ్చిన డిగ్గున నరుంగు వడి డిగ్గి తగన్.

37

37. నృపతి వియచ్చరనాయకుఁడు = రాజదేవేంద్రుడు. హుజూరునకున్ = రాజసమీపమునకు.

చ.

కడువడి వీడియం బుమిసి గ్రక్కునఁ బాదసరోజపాదుకల్
కడు నట దీడఁదన్ని పొసఁగన్వలెవాటు ఘటిల్లు శాటి నె
న్నడుము బిగించి పాగ జతనంబునఁ గైఁ గరమంటి మీసముల్
వడినిడి యంగిచేతు లెగవైచుచు వచ్చి రమాత్యు లత్తరిన్.

38


గీ.

వచ్చి కొలువున్నయెడ నరవరవతంసు
నుడుగర లొసంగి పొడఁగని యుచితసరణి
వంత బరివార మేకాంత మగు టెఱింగి
చనిన నిట్లన పల్కి రా సచివమణులు.

39

39. ఉడుగరలు = కానుకలు.

శా.

క్ష్మారక్షానిధి రాజహంసునికి క్షేమంబే, యయోబాలకుల్