పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

237


చంచత్రజ్ఞు లభిన్నసంధిఘటనాచాతుర్యమాధుర్యులన్.

35

35. వచనమంత్రులన్ = వచనధాటి = వాక్యపటుత్వముచేత. పాటిత = గొట్టఁబడిన. అనఁగా జయింపఁబడిన. అంభోధిరాట్ = సముద్రములు. కాంచీ = మొలనూలుగల భూమి. భృత్ = భరించుచున్న పర్వతములను. హర = కొట్టిన. యింద్రునియొక్క మంత్రులన్ = మంత్రియైన బృహస్పతి గల. నిజ.. ప్రజ్ఞులన్ = నిజమహీకాంత = తమరాజుయొక్క. అనుకూలక్రియాచంచత్ = అనుకూలములయిన పనులతో నొప్పుచున్న. ప్రజ్ఞులన్ = ప్రజ్ఞలుగల. భిన్నసంధిఘటనా = విడిపోయినా కలయికను గూర్చుటయందలి. చాళుక్య = నేర్పుయొక్క. మా = సంపత్తిగాయొక్క. ధర్యులన్ = భారమును వహించిన.

సీ.

ఆగుల్భ లలితంపుటంచు దోవతి కావి
                 యరచిట్ట పింజల కరుణ మెసఁగఁ
దళుకొంద నడుదట్టి దౌరు దన్నెడి యింద్ర
                 గోపంబు పాపోసు లేపుచూప
వలివంపుటంగిపై వలెవాటు వేసిన
                 పైఠాణి తగటు దుప్పటి నటింప
దగుపాటిగా వెన్క సిగ నిల్పిచుట్టిన
                 నిడుద యందపుపాగ నీటుగుల్క


గీ.

నుభయ కటముల శ్రీముద్ర లూర్ధ్వపుండ్ర
సంగతాంగార నవయవక్షారలోహి
తాక్షణ శ్రీల హేజీబు లపుడు వచ్చి
రగణితస్థితి సాహేబునగరి కడకు.

36

36. ఆగుల్బ = చీలమండలపర్యుంతము. పింజెలకున్ = పైమీఁదిఖండువా పింజెలకు. అరుణము = ఎరుపు. దౌరు = కాంతి. ఇంద్ర