పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

రాజవాహనవిజయము

మండలాగ్రలతికా = లతవంటి కత్తియొక్క. ధారా = అంచుయొక్క. రుచుల్ = కాంతులు. ఔదార్యముల్ = అతిశయములు.

క.

దగఁబరచి చనిన గిరి చె
ట్టిగిరించెనె దొనలు నిండె నే మెట్టినచో
ట్లొగి మాసెనె తామర చివఁ
బొగడొందిన భిల్లవల్లభుఁడు మరఁడంచున్.

128

128. దగన్ = భయముచేత. దొనలు = అంబులపొదులు. మునుపటి యుద్ధములో బాణశూన్యములైన యంబులపొదులలో మరల బాణములు సంపాదించెనా యనుట. పొగడొందిన భిల్లవల్లభుఁడు అనఁగా మునుపు భిల్లరాజు చేత మానసారుఁడు రాజహంసుని జయింపఁజేసినట్టు తోచుచున్నది.

క.

అట హరి విక్రముఁ డత్యు
ద్భటహయభటహస్తిఘటలు దగరా నగరా
దట హవణిక వెడలిన మహి
పటహరమై చటుల లటకపటహము మొఱసెన్.

129

129. ఘటలు = ఏనుఁగు గుంపులు. నగరు = పట్టణము. హవణిక వెడలినన్ = అలంకారశూన్యము గాఁగా. మహిపట = సముద్రము. లటక =దుష్టమైన.

శా.

లంకారాణ్మదభంగభంగనిభనీలా నీలవేణీవల
త్సంకేతోద్యదపాంగ పాంగవపదాబ్జక్లేశహృద్ధీనిరా
తంకోత్సాహతరంగ రంగదిషుసుధాభిన్నమాయావి ని