పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

217


మీసంబుల్ వడిఁ గొల్పి బల్మీ నగవుల్ మీరం దృగారుణ్యముల్
మోసుల్ బూనఁగ మానసారమహిపాలుం డాప్తులం గాంచి యో
హెూ సూరుం డరుదెంచె నంచుఁ బలికెన్ హుంకార మేపారఁగన్.

125

125. కృపాణిన్ = చిన్న కత్తిని. దృగారుణ్యముల్ = కన్నుల యెఱుపులు. మోసుల్ బూనఁగన్ = మొలక లెత్తగా. సూరుడు = శూరుఁడు.

క.

జంబుకము చెనకి మత్తగ
జంబుం బొరిఁగొనఁగ మొనయు జగమున మండూ
కంబు ప్రభంజనభుజు జగ
డంబునకు బిలిచె నక్కటా వింతలుగా.

126

126. ప్రభంజనభుజున్ = పామును.

శా.

ఔరా మాగధరాజకుంజరము నేఁ డత్యద్భుతాహంక్రియన్
మేరం జెందిన మాళవాధిపహరిన్ మేల్కొల్పె నస్మద్భుజా
ధారానర్గళమండలాగ్రలతికాధారారుచుల్ మానునే
యారాజన్యుని తండ్రి కిప్పటికి శౌర్యౌదార్యముల్ గల్లెనే.

127

127. మాళవాధిపహరిన్ = మానసారుఁడను సింహమును. అస్మ. . . రుచుల్ = అస్మద్భుజ = మాచెయ్యి. ఆధార = ఆధారముగల