పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

రాజవాహనవిజయము

పదబలము = స్థానబలము. కాళ్ళబలము. అనఁగా నారుకాళ్లు గలవనియును. కృష్ణా = నల్లగలువయొక్క, కృష్ణమూర్తియొక్క. అని ధ్వని. విషము = కాలకూటము, నీరును. శూలితోన్ = త్రిశూలీగడ్డితో, శివునితో ననియు, వక్రగతి = వంకరచేష్ట, వంకరనడకయు, చక్రి= పాము. తాపసాశ్రయ = తపశ్శాలుల కాధారభూతుఁడైన శివునియొక్క. శిఖదండన్ = సిగదగ్గరను. మహాతపశ్శాలి దగ్గరనని ధ్వని. రసమున్ = శృంగారరసమును. మేఘమైతే. రసము = నీటిని విడుచును. కడచూపు లొసఁగి చూడఁదగినదై, ఆకాశమైతే కనఁబడదు. చంపకాన్వితంబు = సంపెంగపువ్వులతోఁ గూడినది, తుమ్మెదలైతే అట్లు గావు. భానుమోహకరము = కాంతులచేతఁ గామమును బుట్టించునది, నల్లగ ల్వైతే. భాను = సూర్యునికి మోహకరము గాదు. చిక్కు విడచి, నాచైతే అట్లు గాదు. జిగివిడక = శోభవదలక, గడ్డియైతే కొన్నాళ్ళకు శోభ తగ్గిపోవును. స్నేహమానఁదగి = చముకురు నొందఁదగి, పామైతే. స్నేహము = మైత్రి చేయఁదగినదిగాదు. కొమరు డించక = కోమలత్వము వదలక. శివునిశిఖయైనతే అట్లుగాదు.

చ.

కలికిమొగంబుసాటిఁ గనఁ గంజము పుప్పొడి మంటలో వన
స్థలమున నిల్చి చక్రగతి సంభమితభ్రమ రాక్షదామ మిం
పొలయ మరుచ్చలద్దశజవోష్మత వే తపమాచరించియున్
బలిమి ముడింగి హాస దశ పారము ముట్టక భంగ మొందెడిన్.

95

95. వనస్థలమునన్ = అరణ్యప్రదేశమందు, నీటియందును. చకగతి = గుండ్రగాఁ దిరుగుటచేత. సంభ్రమిత = తిరుగుచున్న. హాసదశ = నవ్వుయొక్క అవస్థ. అనఁగా నందరిచేత నవ్వఁబడుట. వికసించుట.