పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

203


ఇటులుండవలదా చెలీ గుబ్బ లెడ గాని
                 మలదోయినున్న గా మలచినటుల


గీ.

అహహ యిటులుండవలదా యొయారి తొడలు
పద్మికరములు తరుమణిఁ బట్టి నటుల
నంచు మ్రొక్కి నుతించుఁగా కతివఁ గన్న
నంగభవుఁ డోపఁ డవ్వల నడు గిడంగ.

93

93. కమ్మచ్చునన్ = బంగారము తీగఁదీయునట్టి సన్నతొలలు గల యినుపకమ్మియందు, రేకు చరచినట్టు = రేకు వేసినట్టు, చికిలి = మెఱుఁగు, మలదోయి = రెండుపర్వతములు, మలచినట్లు = చెక్కినట్లు, పద్మికరములు = ఏనుఁగుతుండములు, తరుమణి = కఱ్ఱలకు మెరకపల్లములు దిద్దు యంత్రము.

సీ.

చపలానుభవమె కా కిపుడు సాటియె యంబు
                 దంబు విష్ణుపదంబు దండఁగన్నఁ
బదబలమే కాక భ్రమరంబు సమమౌనె
                 కృష్ణాబ్జసాంగత్య మెనసియున్న
ననిశంబు విషమన్న • గుటగా కెనయె శై
                 వల మల శూలితో నలరియున్న
వక్రగతియెకాక చక్రితా నీడౌనె
                 తాపసాశ్రయ శిఖ దండనున్న


గీ.

రసము విడువక కడచూపు లొసఁగి చంప
కాన్వితంబయి భానుమోహకర మగుచుఁ
జిక్కు విడచి జిగి విడక స్నేహ మూనఁ
దగి కొమరు డించకుండు బిత్తరి నెరులకు.

94

94. చపలానుభవము = చంచలమైన అనుభవము, మెఱుపుయొక్క అనుభవమును. విష్ణుపదంబు = ఆకాశము, విష్ణుస్థానమును.