పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

197

గల.) పంచ... భవన = పంచవర్ణ = అయిదురంగులుగల, ఛద = ఱెక్కలచేతను, ఉదంచత్ = ఒప్పుచున్న, రత్నమయీభవత్ = రత్నవికారమైనదౌచున్న, భవన = గృహముగల. రామాఖ్యాసమాఖ్యాత్రిన్ = రామనామమును బలుకుచున్న. వైరించాం. . . శుకీజన్ = వైరించాభోజముఖీ = సరస్వతియొక్క. శుకీజన్ = ఆడుచిలుకవలనఁ బుట్టిన, కీరిన్ = ఆడుచిలుకను.

క.

ఇందుముఖి చింద నొరపు
“ల్వందేవాల్మీకికోకిలమ్మ"ను నవమా
కందమకరందబృందము
గ్రందుకొనం బలుకు చిలుకఁ గానుక యిడుచున్.

80

80. నవ...బృందము = నవ = క్రొత్తదియగు, మాకంద = మామిడిచెట్లయొక్క, మకరంద = పూఁదేనెలయొక్క, బృందము = సమూహము. ఒరపుల్ చిందన్ = శోభలు వ్యాపించగా.

క.

కెంజూ పింతట విడుమం
చుం జిరితో దొరకు శరణుఁ జొచ్చిన ముకుళ
త్కంజాతము బలె రంజిల
నంజలి ఫాలమునఁ జేర్చి యల్లనఁ బల్కెన్.

81

81. కెంజూపు = ఎఱ్ఱనిచూపు కోపదృష్టిననుట. చిరితోన్ = చిలుకతోఁగూడ. ముకుళత్ = ముణిఁగియున్న. అల్లనన్ = మెల్లగా.

క.

విన్నపమేమున్నది చెలి
నిన్నటివావేళ నిచట నిన్నటు తుదఁ గ
న్గొన్నది మొదలొదవిన దయ
కన్నది విన్నదియుఁగాదుగా మగధనృపా.

82

82. నిన్నటివావేళన్ = నిన్నటిప్రొద్దుట. నిన్ను. అటు = ఆప్రకారముగా. తుదన్ = చిగురువరకు, దయ = కరుణరసము అనఁగా విచారము.