పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

రాజవాహనవిజయము


ఘనసారతనువు నుప్పునఁ గ్రాచి వైచిన
                 శ్రీకనత్కనకశలాకఁ జెనకఁ


గీ.

జందనకరంబులు విభాసికుందహిమస
మన్వితపుఁ దమ్మి నగనున్న మగధనృపతిఁ
జక్కఁగాఁ గాంచి నాచేతఁ జిక్కె ననుచు
నక్కిసలయోష్ఠి చక్రేశుచక్కి కరిగి.

78

78. ఎండకునిండి = ఎండచేతనిండి. చేఁజిగురున్ = చేతిలో నాయుధముగానున్న చిగురును. పదవిచ్చు = పదు నెక్కిన. అంబకమున్ =బాణమును. పగటన్ = ప్రకటింపఁగా. ఘనసారతనువు = కర్పూరముఁ బూసిన శరీరము. శ్రీకనత్ = శోభచేతఁ బ్రకాశించుచున్న. కనకశలాకన్ = బంగారుకణికను. చందనకరంబులు = గంధముఁబూసినచేతులు.

శా.

పంచేషూగ్రజయాంకకంకణరణత్పాదాందుకాగ్రచ్ఛిదా
చంచచ్ఛాతనచుంచుచంచుహృతమోచం బంచవర్ణచ్ఛదో
దంచద్రత్నమయీభవద్భవన రామాఖ్యాసమాఖ్యాతి వై
రించాంభోజముఖీశుకీజనాళకీరిం గేలఁ గీలింపుచున్.

79

79. పంచేషూ... మోచన్ = పంచేషు = మన్మథునియొక్క, ఉగ్రజయ= భయంకరమైన జయమునకు, అంక = చిహ్నము లైన, కంకణ = కడియములచేత, రణత్ = ధ్వనించుచున్న, పాదాందుకా = కాలిగొలుసులయొక్క, అగ్ర = చివరలయొక్క. ఛిదా = కొరుకుటచేత, చంచత్ =కదలుచున్న, శాతనచుంచు = వాడితోఁగూడిన, చంచు = ముట్టెచేత, హృత = హరింపబడుచున్న అనఁగా దినఁబడుచున్న, మోచన్ = అరటిపండు