పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

151

పొలది = అల్లది, ప్రల్లదములఁజల్లన్ = కారుమాటలాడఁగా, జాతి = ప్రతిజ్ఞ (అని తోచుచున్నది.) (లేక ఒట్టు అని.) తెంచు = కొప్పు విడినట్టి, నెరులన్ = వెండ్రుకలను, తామరగలిగెన్ = పద్మము దొరకెను. బేడస = మత్స్యవిశేషము. రథాంగమని = చక్రవాకమని, లతాంగ =స్త్రీయొక్క, జంగచరచెన్ = దాటిపట్టుకొనెను. నాతిదెంచు అను చరణము మొదలు గురురథాంగ అను చరణమువఱకు భ్రాంతులు. కొమ్ము = చిమ్మనగొట్టము. తాచెన్ = కొట్టెను. గాత్రమైన = శరీరమందైన. నేత్రమునన్ = వస్త్రముచేత, వైచెన్ = కొట్టెను. క్రోవిఁ జిమ్మి = చిమ్మనగ్రోవి విసరి, (అనఁగా నీరు చిమ్మనగ్రోవితోఁ జల్లి.) హత్తి = పట్టుకొని.

క.

ఈలీలఁ దేలి విహృతులు
సాలించి నృసాలతనయ సహయౌవతయై
కేలీసరస్తటమునకు
వ్రాలి లతాతన్వి యొకతె వడిఁ దడియొత్తన్.

123

123. సహయౌవతయై = స్త్రీసమూహముతోఁ గూడినదై.

చ.

పనుపడిఁ బూను సారె తెలిపావడపై నెరిపట్టుకుంచెఁ గ
ట్టిన యపరంజిపువ్వులు ఘటించెడు చందురుకావిఁ గట్టి పే
ర్చిన యరజారుకొప్పున ధరించి విరుల్ మృగనాభినాభియై
తనరఁగఁ దీర్చి కుంకుమ కదంబము పూసె విలాసరాశియై.

124

124. పనుపడన్ = అనుకూలముగా. పావడ = గాగరా. కుంచె = కుచ్చెళ్ళు. మృగనాభి = కస్తూరిచేత. నాభి = బొడ్డుగలది. కదంబము = పరిమళవస్తువులన్నియు గలిపిన ముద్ద.