పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

రాజవాహనవిజయము


కలికి బేడస యని ప్రోడ
                 కన్ను జూడ మళ్లె నొకతె
గురు రథాంగ మని లతాంగ
                 కుచము జంగ చరచె నొకతె
తరుణిఁ బొంచి శిరమువంచి
                 దరిని ముంచి పరచె నొకతె
కనలి కొమ్ముఁ గొని కరమ్ము
                 కలికిరొమ్ము దాచె నొకతె
మొనసి గాత్రమైన నేత్ర
                 మున సునేత్ర వైచె నొకతె
కొదమ తమ్మకంటిఁ గమ్మి
                 క్రోవెఁ జిమ్మి నవ్వె నొకతె
ముదిత హత్తి కడకునెత్తి
                 మొల్లగుత్తి రువ్వె నొకతె.

122

122. గమ్ముచిమ్ములాట = గమ్ముమనునట్టుగా నీళ్ళుఁ జల్లుకొనుట. బిసముఁ జెండు = తూఁడుఁ గొఱుకుచున్న. ఎడలన్ = ఆయాస్థలములయందు. ప్రాచి = నాచు. కడ =దగ్గిర. జంట = సమీపము. గుబ్బు = గుండెలు కొట్టుకొనుట. మీటు = పెంపు, జూటు = మోసముగల, గాటమైన = అతిశయించిన, కరడున్ = తరంగమును, తట్టి = తాకి, ఆలిపాలి = చెలికత్తెలపఙ్క్తి, హాళిన్ = విహారమును, గదిమెన్ = బూకరించెను, తిట్టు = ఒట్టుఁ బెట్టునట్టి. తుట్టు బెట్టెన్ = నష్టము కలుగఁజేసెను. కాని యొట్టు = అయోగ్యమైన యొట్టు, నట్టు గొట్టెన్ =అడ్డుకొనెను, సాటికిన్ = దృష్టాంతమునకు, సేన = విస్తారముగా, లోగి = అలసి, ఓలయెన్ను = ఓలయని పలుకుచున్న, కన్నయన్నున్ = చూచిన స్త్రీని. ఒరసి = దగ్గరయై, చుట్లన్ = తిరగడములచేత, ఎల్ల = హద్దు, వెడలనొల్లదాయెన్ = దాటలేకపోయెను