పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

రాజవాహన విజయము

(తృతీయాశ్వాసము)

శ్రీలక్ష్మీ కమలాక్షీ
శ్రీలక్ష్మీకృతకటీరశింజితకాంచీ
లోలచ్చిత్తమరాళక
రా లఘువిక్రమణ వేంకటాచలరమణా!

1


వ.

అవధరింపుము.

2


శా.

వేలాదంతి పెకల్చివైవ నపరోర్వీభృచ్ఛిరోగంబు పై
వ్రాలంజాలిన పూర్వసింధుసరసీరక్తాబ్జ మట్లొప్పె దా
నాళీకాప్తుఁడు చిందు తద్రజ మన న్సంధ్యాతపం బొప్పెఁ ద
న్నాళోత్థాంబుకణాళి పంకములనందారా తపంబు ల్దగెన్.

3