శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
రాఘవపాండవీయము
చతుర్థాశ్వాసము
| 1 |
వ. | అవధరింపు మక్కాలంబున. | 2 |
క. | తనయేలికసానికడకుఁ | 2 |
భారత. ఘనైశ్వర్యమును, రక్షి = రక్షించెడువాఁడు, తదనుజుఁడు = సుధేష్ణతమ్ముఁ డయిన కీచకుఁడు, ఏతెంచిన అప్పావని = ద్రౌపది, మిగులనడఁగి వర్తిలెన్ = అణఁకువతో నుండెను.
రామ. తనయేలికసానికడకున్ = సీతవద్దికి, ఘనైశ్వర్యముచేత, రక్షిత = రక్షింపఁబడిన, దనుజుఁడు= రాక్షసులు గలవాఁడు, అఘవర్తనుఁడు = పాపకర్ముఁ డైనరావణుఁ డని, ఏతెంచినన్ = రాఁగా, పావని = పవనపుత్రుఁడైన హనుమంతుఁడు, పతిహితవృత్తిన్ = నడఁగి వర్తిల్లెను - పతిహితవృత్తి యైనవానికిఁ దద్భార్య చిత్తశుద్ధిని శోధించెడుచోట నణఁగియుండుట ధర్మమే గనుక, రావణునియొక్కయు నాసీతయొక్కయు సంభాషణప్రకారము వినఁగోరి యెఱింగించుకొనక యుండెననుట.
రెంటికి సరి.
వ. | అప్పుడు. | 3 |
చ. | అతనుఁడు తత్సతిద్యుతిసహాయత నెంతయుఁ గ్రొవ్వి యవ్విని | 4 |