Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరాధిత = ప్రార్థింపఁబడినవాఁడవై, స్మర = మన్మథునినిమిత్తమై, మోచిత = విడిపింపఁబడిన, ఆత్మ = తననిమిత్తమైన, పురాతన = పూర్వకృతమైన, అపకృతి = అపకారముయొక్క, స్మృతీ = స్మరణ గలవాఁడా! పార్వతీప్రార్థనవలన మన్మథునిఁ దిరుగ బ్రతికించినవాఁ డనుట.

గద్యము.

ఇది శ్రీమన్మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వత
సంపదానందనందవరకులక్షీరపారావారరాకాసుధాధామ ముద్దరాజ
గణపయామాత్య పెదరాయధీమణిప్రదర్శితం బైనరాఘవపాండవీ
యాదర్శంబునందుఁ దృతీయాశ్వాసము.