Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. ఫలంబును = ఫలమును, ఏఁడొకటి పూర్ణముగాన్ = ఏఁడాదినిండుపర్యంతము, మగతనంబుకడంకలరూపుమాలుటల్ = పేడితనము వచ్చుట యనుట, ఒదవుఁ గాక.

వ.

అని పలికి తదనంతరంబ.

77


సీ.

మదిచపలతఁ దన్ను నెదిరిఁ గానమిని సీ
           తాదేవరామ లాస్యాదితత్వ
విశ్రుతినాస యై వేల్పులు దనరాక
           పోకలు గాంచి యుబ్బునఁ జెలంగ
నుండనేరక మర్త్యయోగేచ్ఛఁ జని యిట్లు
           వచ్చెనే యని కన్నవారు నవ్వ
సిగ్గు లే కేమని యగ్గలికను జన
           స్థానంబు చేరి తత్సంశ్రయఖర


తే.

దూషణాదులచేత నా దుర్లలితము
లంతకంతకు దీపింప నాత్మవార్త
జరిపెదను జాతివికృతిచేష్టలు దివిజుల
ప్రీతి నుడిగించె ననుచింతఁ బెట్టి మదిని.

78

భారత. కానమిని, ఇసీ = నిందావాక్యము, తా- దేవరామ = తాను దేవతాస్త్రీ, లాస్యాది = నృత్తగీతవాద్యములయొక్క, తత్త్వ = సిద్ధాంతజ్ఞానముయొక్క, విశ్రుతిన్ = ప్రసిద్ధిచేత, ఆసయై = ఆసపుట్టి యనుట, వచ్చెనేయని, కన్నవారు = చూచినవారు, నవ్వ సిగ్గులేక యేమని, జనస్థానంబు చేరి, సభకుఁ బోయి, తత్సంశ్రయ = ఆసభయాశ్రయముగాఁగల జనులయొక్క, ఖర = క్రూరములైన, దూషణాదులచేత, నా, దుర్లలితములు = చెడ్డవలపులు, దీపింప, ఆత్మవార్త = ఆత్మభరణమును, జరిపెదను, జాతివికృతిచేష్టలు = అప్సరోజాతికిఁ దగనిచేష్టలు, దివిజులప్రీతి నుడిగించెను, అనుచింతన్ = అనెడి విచారమును, మదిని బెట్టి, నివాసమున కరిగెనని ముందరిపద్యమునఁ గ్రియ.

రామ. కానమిని, సీతాదేవర = సీతకు మఱఁదియైన లక్షణునియొక్క, "స్యాలాస్స్యుః భ్రాతరఃపత్న్యాఃస్వామినో దేవృదేవరౌ” అని అ. ఆమల = స్వచ్ఛమైన, అసి = ఖడ్గముచేత నైన, "చంద్రహాసాసిరిష్టయః” అని అ. ఆదితత్వ = మిక్కిలిఖండితత్వముచేత, అంటఁబట్టి కోయఁబడినదౌటచేత ననుట, విశ్రుతినాసయై = చెవులు ముక్కు లేనిదై, సిగ్గులేక, ఏను, మని = బ్రతికి, జనస్థానంబు చేరి = ఖరునిపట్టణమునకుఁ బోయి, తత్సంశ్రయ= అందున్న, ఖరదూషణాదులయొక్క, చేతనాదుర్లలితములు = బుద్ధిదుశ్చేష్టలు, "ప్రతిపద్ జ్ఞప్తిచేతనా” అని అ. దీపింప, ఆత్మవార్త = తనవృత్తాంతమును, “వార్తా ప్రవృత్తిర్వృత్తాంతః” అని అ. జరిపెదన్ = నడిపించెదను. చెప్పెదననుట, అనుచిం