Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలవాని, తార = అధికమైన, "తారోత్యుచ్చైః" అని అ. ధ్వాన = ధ్వనితోడ, “ధ్వనీధ్వానరవస్వనాః” అని అ. యుత = కూడిన, అట్టహాసముచేత, విసరత్ = వ్యాపించుచున్న, దంష్ట్రా = కోఱలయందుఁగల, మయూఖాళిన్ = జ్వాలాపరంపరలచేత, “మయూఖస్త్విటరజ్వాలా” అని అ. కిమ్మీరాభిఖ్యన్ = చిత్రవర్ణమైన కాంతిచేత, “అభిఖ్యా నామ శోభయోః" అని అ. తనర్చురాక్షసుని, ఆటోప = వేగముచేత, దుర్వార మౌనట్టుగా, ఆకృష్ట = అపహరింపఁబడిన, మహీజుఁడై = సీత గలవాఁడై, మదమువల్ల, మ్లిష్ట = స్పష్టముగాని, “అథమ్లిష్ట మవిస్పష్ట" మని అ. ఉక్తులు = మాటలను, వదరు = వదరెడి గర్వగ్రస్తుని, విరాధున్ = విరాధుఁ డనెడివాని, కూల్చెను.

భారత. దోరాస్ఫాలకరాళితోద్దతియొక్క, విరాధున్ = ప్రాప్తిగలవాని “రాధనం సిద్దౌ” ఆనుధాతువున ఘఞంతము. విరాధున్ = ధూర్తుని ననియుఁ జెప్పవచ్చును. “రాధో మృగయుదుష్టయోః" అని వి. కిమ్మీరాభిఖ్యఁ దనర్చు రాక్షసున్ = కిమ్మీరుఁ డనురాక్షసుని, ఆకృష్ట = తివిచికొనఁబడిన, మహీజుఁడై = వృక్షములు గలవాఁడై, కడమ సులభము.

ఆ.

ఆనిశాటుఁ డట్లు హతుఁ డయి దేవతా
తుష్టిఁ జేసి వారు దొడఁగినట్టి
విపినవాసకార్య మపవిఘ్న మై సాఁగఁ
బ్రథమహత మగుబలిపశువుఁబోలె.

31

రెంటికి సమము సులభము.

వ.

అది యట్లుండె మహారణ్యంబు దఱియంజొచ్చి యారాజమూర్ధన్యుండు.

32

భారత. ఆరాజమూర్ధన్యుండు = భీముఁడు.

రామ. ఆరాజమూర్ధన్యుండు = రాముడు.

క.

ఈ తెఱఁగున సతితో స
భ్రాతృకుఁ డై వరుసఁ జని ప్రపంచితసుమనో
ద్వైతవనభూములందుఁ
భూతామోదమున నెలమి వొందుచు నంతన్.

33

రామ. సతితోన్ = సీతతోఁగూడ, సభ్రాతృకుఁడై = లక్ష్మణసహితుఁడై, ప్రపంచిత = విస్తరింపఁబడ్డ, సుమనః = పుష్పములతోడ, అద్వైత = ఐక్యముగల, వనభూములందు, పుష్పితవనములయం దనుట, ఎలమిఁ బొందుచు.

భారత. సతితోన్ = ద్రౌపదితోఁగూడ, సభ్రాతృకుఁడై = రాజాదులతోఁ గూడినవాఁడై, ప్రపంచిత = ప్రసిద్ధులైన, సుమనః = సజ్జనులు గల, ద్వైతవనభూములందు, ప్రభూత = ప్రచురమైన, కడమ సరి.