Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంహృష్యత్ = సంతోషించుచున్న, ఋషులచేత, అర్చితా = పూజింపఁబడ్డవాఁడా, గృధ్నుతా = ఆపేక్షచేత, “గృధ్నుస్తు గర్ధనః - లుబ్ధోభిలాషుకస్తృష్ణ" క్కని అ. అపూర్వకమౌనట్టుగా, ఆకృష్ట = అంగీకరింపఁబడిన, శిష్టులచేతియర్చనలు గలవాఁడా.

గద్యము.

ఇది శ్రీమన్మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వత
సంపదానంద నందవరకులక్షీరపారావార తారకాసుధాధామముద్ద
రాజు గణపయామాత్య పెదరామధీమణిప్రదర్శితం బైన రాఘవ
పాండవీయాదర్శంబునందు ద్వితీయాశ్వాసము.