Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాహుళ్యప్రదపాదసంస్మరణ పంపాహేమకూటాద్రిఖే
లాహేవాకవిపాకవిస్మరితకైలాసాదికేళీరసా.

117

మాహానాథ = గోరాజైన వృషభమే, “మాహేయీ సౌరభేయీ గౌరుస్రా మాహాచ శృంగిణీ" అని అ. విహారార్థమైన వాహనము గలవాఁడా, కృపామాహాత్మ్య మనెడి, సాహాయ్యక = సహాయముచేత, ఉత్సాహి = ఉప్పొంగిన, శ్లక్ష్ణకటాక్ష = కటాక్షలేశముచేత, “శ్లక్ష్ణం దభ్రం కృశం" అని అ. “కటాక్షోపాంగదర్శనే” అని అ. విక్షపిత = చెదరమీటఁబడిన, భక్తవ్రాతముయొక్క, సంసార = జన్మాదిబంధము గలవాఁడా, భక్తుల నిత్యులఁ జేసెడివాఁ డనుట, శ్రీబాహుళ్య = ఐశ్వర్యపరంపరను, ప్రద = చాలా ఇచ్చెడి, పాదసంస్మరణము గలవాఁడా, పాదారవిందస్మరణమువల్ల సంపదను, ప్రసన్నతవల్ల మోక్షము నిచ్చెడివాఁడు గనుక, పంపానదియందుఁ గల, హేమకూటాద్రియందుఁ గల, ఖేలా = విహారముయొక్క, "క్రీడా ఖేలా చకుర్దన” మని అ. హేవాక = హృదయంగమ మైన, విపాక = పరిచయముచేత, విస్మరిత = మఱువఁజేయఁబడిన, కైలాసాది = కైలాసగంగలయొక్క, కేళీరసా = విహారాపేక్ష గలవాఁడా, హేమకూటపంపానదులు కైలాసగంగలకంటె శ్రేష్ఠము లనుట.

క.

పెదవేంకటాద్రిహృదయా, స్పదపదవిన్యాసతుంగభద్రావీచీ
మృదుశీకరవిరచితనిజ, సదనాంగణరంగవల్లిసౌభాగ్యకళా.

118

రంగవల్లి = ముగ్గులయొక్క.

స్రగ్విణి.

బ్రధ్నకోటీసమభ్రాజితేజోఘనా
బుధ్నభావాప్తిసంపుష్టసృష్టిద్రుమా
ఋధ్నవద్భోధసంహృష్యదృష్యర్చితా
గృధ్నుతాపూర్వకాకృష్టశిష్టార్చనా.

119


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారకవిత్వవైభవ పింగళి యమర
నార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామధేయప్రణీతం బైన
రాఘవపాండవీయంబునందు ద్వితీయాశ్వాసము.

బ్రధ్నకోటీసమ = కోటిసూర్యసమ మౌనట్టుగా, భ్రాజి = ప్రకాశింపుచున్న, తేజస్సుచేత ఘనమైనవాఁడా, బుధ్నభావ = మూలమౌటయొక్క, “మూలం బుధ్నోంఘ్రినామకః” అని అ. ఆప్తి = ప్రాప్తిచేత, సంపుష్ట = పోషింపఁబడిన, సృష్టి యనెడి, ద్రుమా = వృక్షము గలవాఁడా, ఋధ్నవత్ = వృద్ధిఁ బొందుచున్న, బోధ = జ్ఞానముచేత,