Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. భూమిభృత్కుల = పర్వతసమూహములకు, "భూభృద్భూమిధరే నృపే” అని అ. విరోధియైనయింద్రునియొక్క, హేతిధారికిన్ = జ్వాలావహుఁడైనయగ్నికి, నుతకీర్తిని, హరిన్ = కృష్ణుని, కూడి, ఆత్మపురికిన్ = ఇంద్రప్రస్థపురమునకు, ఏఁగెను.

సీ.

సర్వేశ్వరుఁడు కృష్ణు సఖ్యాతిమహిమకు
            నెంతపెంపును దగు నేమి చెప్ప
దక్షుఁ డానరుఁ డట్లు దనర రాక్షసకుల
            తక్షకుం డతివిచిత్రతరశక్తి
మయుఁ డతిక్రాంతవాఙ్మానసభావిశే
            షంబు వైవస్వతసంతతికిని
దనదులీలోదయంబునను సంపాదించి
            పెట్టె నత్యంతంబు పెంపుసొంపు


తే.

సంఘటిల మరుచ్ఛతమఖసంతతుల క
తఁడు గదాదండమును సమిద్ధజయనాది
కంబువరము నిచ్చెను హరికిం బడరఁగఁ
బలుదెఱంగుల నార్యులుఁ బ్రస్తుతింప.

111

భారత. సర్వేశ్వరుఁడగు కృష్ణునియొక్క సఖ్యము చేతనైన యతిమహిమకు, దక్షుఁడు, ఆనరుఁడు = ఆయర్జునుఁడు, అట్లు దనర = ఆలాగున నొప్పుచుండఁగా, రాక్షసకులముయొక్క, తక్షకుండు, విశ్వకర్మ, “తక్షకో నాగవర్ధక్యోః" అని అ. అతివిచిత్రతరమైన శక్తి గలవాఁడు, మయుఁడు, అతిక్రాంత = అతిక్రమింపఁబడిన, వాక్కులయొక్క, మాన = పరిమాణముగల, వాగగోచర మనుట. సభావిశేషంబును, వైవస్వతసంతతికిన్ = ధర్మజునకు, తనదు, లీలోదయంబునన్ = క్రియాచాతుర్యముచేత, సంపాదించి పెట్టెను, మరుచ్ఛతమఖసంతతులకు = వాయువుయొక్కయు నింద్రునియొక్కయుఁ బుత్త్రుల - భీమార్జునులకు, అతఁడు, మయుఁడు, గదాదండమును, సమిద్ధ = ప్రకాశింపుచున్న, జయ = జయము గలుగునట్టుగా, నాది = మ్రోసెడి, కంబువరమును = శంఖశ్రేష్ఠమును, “శంఖస్స్యాత్కంబురస్త్రియా” మ్మని అ. హరికిన్ = శ్రీకృష్ణునికి, ఇంబడరఁగన్ = ఇంపగునట్టుగా, “ఇంబడరఁగా భజసనంబు" లని యనంతుని ఛందఃప్రయోగము.

రామ. కృష్ణు = విష్ణువుయొక్క, సఖ్యాతి = ఖ్యాతితోఁ గూడిన, దక్షుఁ డానరుఁడు, తక్షకుండు = శాసకుఁడు, శక్తిమయుఁడు, అతిక్రమింపఁబడిన, వాఙ్మనస = వాక్కును మానసమును గల, అవాఙ్మానసగోచర మనుట. భావిశేషంబు = కాంతివిశేషమును, వైవస్వతసంతతికిన్ = వైవస్వతమనువుయొక్క వంశమునకు, తనదు = తనయొక్క, లీలా = విలా