Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేత, గ్రామిక = ఆక్రమింపఁబడ్డ, పోఁగొట్టఁబడ్డదనుట, స్వర్గముయొక్క, పద్ధతి = మార్గము గలవాఁడై, ఇష్టమైన, మహా, అవనీచరత = భూసంచారమును, చెందంగాంచి మదిని, పొంగెన్ = సంతసిల్లెను.

భారత. నృపసూనుఁడు = అర్జునుఁడు, అట్టిధనువు = గాండీవమును, ఐంద్రాయుధోద్ధతి = ఇంద్రుని యాయుధములయొక్క యుద్ధతితోఁ గూడిన, పాథోద = మేఘములను, నిరాసి యయ్యెన్ = పోఁగొట్టినవాఁ డాయెను. ఇంద్రునివజ్రము మొదలైనయాయుధములను మేఘములను బోఁగొట్టెననుట. సముల్ = సంతోషముతో గూడిన, వేగ = సంభ్రమముతోడ నైన, “సమౌ సంవేగసంభ్రమౌ” అని అ. యుక్తతన్ = కూటమిచేత, ఆతండున్ = ఆయగ్నియు, కీర్తించి, కృతమైన, అవృథా = వ్యర్థము గాని, ఆగ్రహ = చలముగల, తత్ = ఆయర్జునునియొక్క, అస్త్రములచేత, శ్రామితస్వర్గపద్ధతియై= కప్పబడ్డాయాకాశమార్గము గలవాఁడై, ఆర్జునుఁడు శరపంజరము గట్టెఁ గనుక, ఇష్టమైన, మహా, వనీ= వనముయొక్క, చరతన్ = భక్షణమును.

తే.

తనకనలుచేష్ట లంతభీతిని ఘటింప
మగిడి శరణన్నఁ దన్మహి మయుఁ దదాత్త
తన్మహాదైన్యము గణించి దయ దలిర్పఁ
గాచె నేమన నప్పు డారాచపట్టి.

112

భారత. తనకు, అనలుచేష్టలు, అంతభీతిన్ = నాశభయమును, ఘటింప, శర ణన్నన్ = శరణు వేఁడినను, తన్మహిన్ = ఆఖాండవవనభూమియందు, మయున్ = మయుఁ డనువాని, తదా = తత్కాలమందు, ఆత్త = పొందఁబడిన, తత్ = ఆమయునియొక్క, మహాదైన్యమును గణించి, ఆరాచపట్టి = అర్జునుఁడు, కాచెన్ = రక్షించెను.

రామ. తనయొక్క, కనలుచేష్టలు = కోపచేష్టలు, అంతైన, తత్ = ఆపరశురామునియొక్క, మహిమయున్ = మహిమను, కడమ సరి.

ఉ.

స్రుక్కక భూమిభృత్కులవిరోధి కడంక నడంచి యిమ్మెయిం
దక్కక హేతిధారి కుచితం బగుకార్యము నిర్వహించి పెం
పెక్కుడు గాఁగ నాత్మపురి కేఁగె హరిన్నుతకీర్తిఁ గూడి న
ల్దిక్కులఁ బిక్కటిల్లుచుఁ దలిర్చు ప్రతాపవిజృంభణంబునన్.

113

రామ. భూమిభృత్కులవిరోధియైన పరశురామునియొక్క, కడంకన్ = గర్వమును, హేతిధారికిన్ = శస్త్రధారునకు, “రవేరర్చిశ్చ శస్త్రంచ వహ్ని జ్వాలా చహేతయః” అని అ. హరిత్ = దిక్కులయందు, “ఆశాశ్చ హరితశ్చ తాః” అని అ. నుతమైన, ఏఁగెను = క్రియ, కడమ సులభము.