Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నతవలనఁ గలుగు నీపదిదోషములను ప్రకాశవర్షుఁడు వివరించినపద్దతిని బట్టి యాలోచించిన నాయాగుణముల యభావము నీతఁడు విశేషదోషములుగాఁ బరిగణించినట్లు లేదు. మ ఱే మన నీపదిగుణములును దక్కినగుణములును గావ్యమున కత్యావశ్యకము లైన ట్లీతని దృఢాభిప్రాయముగాఁ దోఁచెడిని. దండియు నిట్టియభిప్రాయముతోడనే శ్లేషాదిదశగుణములను మాత్రమే పేర్కొనియుండెను, గాని, వానియభావమును దోషములుగా నెంచియుండలేదు.

వేంకటరామశర్మగా రిట్లు వ్రాసియున్నారు:-[1]

"భామహుఁడు దఁడియుఁ గావ్యలక్షణములను దద్భేదములను విపులముగాఁ జర్చించియుండిరి. వారి కుపజీవ్య మగు గ్రంథ మొకటి యుండవలెను. అది యీరసార్ణవమే. ఇందు ద్వితీయపరిచ్ఛేదము—

'నిర్దిష్టస్యాపి కావ్యస్య గుణోపాదాన మన్తరా'

అని ప్రారంభింపఁబడెను. దీనినిబట్టి మనకవి కావ్యలక్షణములను దద్భేదములను గ్రంథాంతరమున వివరించియుండుటచే నా ప్రసంగముచే నిట విడిచె నని యూహింపనగును. మఱియు నితరాలంకారగ్రంథములందువలె నిం దాశీర్నమస్క్రియాపూర్వక మగుకృత్యాది గాని, గ్రంథకర్తృప్రశస్తి గాని, యనుబంధచతుష్టయనిరూపణాదులు గాని లేవు. ప్రథమపరిచ్ఛేదము దోషవిచారకము. వీని నన్నిటింబట్టి చూచినఁ గావ్యనిర్దేశప్రకరణాదులు గల మఱికొన్నిప్రకరణము లుత్సన్నము లైయుండితీరు నని నిర్ణయింపఁ జనును.”

ఈయభిప్రాయములు చాలవఱ కవిమర్శపూర్వకములు. రసార్ణవము దండిభామహుల కుపజీవ్య మెంతమాత్రమును గా దనియు, వీరిరువురకంటెను రసార్ణవకర్త చాల నవీనుఁ డనియుఁ గాలనిర్ణయాదిప్రకరణముల నిరూపింపఁబడినది. కృత్యాదిగ్రంథము కొంత లోపించిన లోపింపవచ్చును. మొదటి పరిచ్ఛేదమున దోషములు వివరింపఁబడెను. రెండవపరిచ్ఛేదమున గుణవిచారము చేయఁబడెను. అందువలనఁ గావ్యము నిర్దుష్టమైనను, గుణసహితము కానిచో సాధువు కానేర దనుపాఠమే-

  1. Introduction to 'Rasarnava.'—P. XVI.