పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

రంగనాథరామాయణము

ఉత్తరకాండము

ఇయ్యది కాచవిభుఁడు, విఠ్ఠలరాజు నను నిరువు రన్నదమ్ములు తండ్రి (కోన బుద్దరాజు, ఈతఁడే పూర్వకాండమును రచించెను.) యాజ్ఞచే రచించిరి. ఇదితప్ప వేరొకగ్రంథము చేసినట్లుఁ గానరాదు. వీరు క్షత్రియు లనఁబడుచున్నారు. కృష్ణాతీరవాసులు. దీనిని 12 వ శతాబ్దాంతంబున రచించినట్లు కానఁబడుచున్నది. అనగా యిప్పటికి 700 సం॥లు కావచ్చుచున్నవి. ఇయ్యది భాస్కరరామాయణంబునకుఁ బూర్వమా, పరమా, సమకాలికమా యని విమర్శనీయంబు భాస్కర, రంగనాథరామాయణ విరచిత కవులిరువురు రాజునొద్దకు తమగ్రంథంబుల తీసుకొని వెళ్ళ రాజు రంగనాథరామాయణంబును గుడిచేతితోను, భాస్కరరామాయణంబును యెడమచేతితోను నందుకొనినట్లును యందుపై భాస్కరుఁడు కినిసి నీ కిచ్చుటకంటె గుఱ్ఱపువాని కిచ్చుట మంచిదని వెళ్ళిపోయిన ట్లొకగాథ కలదు. ఇందునుబట్టి నివి సమకాలికునివిగాఁ గన్పట్టుచున్నవి. ఈగాథ విశ్వాసనీయము కాదని పలువురయభిప్రాయము.

ఇఁకఁ బూర్వమా పరమా యని ఆలోచింతము. పూర్వకాండము పూర్వమే యని శైలినిబట్టియుఁ, గవిత్వసరణినిబట్టియు, యిదివరకు నెవ్వరైనను జేసినట్లును ప్రస్తావించకుండుటనుబట్టియు, సంస్కృతకవులనే స్తుతించుటనుబట్టియు, దేవునిపేరున రచించుటనుబట్టియు, ప్రాచీనకవిత్వలక్షణాధిక్రమమునఁ బోవుటఁబట్టియు పద్యకవిత్వంబునకుముందే ద్విపదకవిత్వ ముండుట మొదలగు కారణంబులఁబట్టి యిది ప్రాచీన ప్రథమరామాయణం బని దేలుచున్నది. ఉత్తరరామాయణముకూడ కవనధోరణిఁబట్టి పూర్వకా౦డము రచించినవారే అయియుండవచ్చునని కం॥ వీరేశలింగంపంతులు వారంటివారుకూడ యభిప్రాయపడుచున్నారు. అది సరియైనది కాదని మానమ్మకము. . ఏలయన సాధారణముగాఁ దాళపత్రగ్రంథాదులందు నక్కడక్కడ పోయినభాగములందు నాపూర్వగ్రంథశైలితో గలియుపదములఁ బూరించ యత్నించుచుండుటయు, ఒకకవీశ్వరునిశైలి నలవడఁజేసికొనుటకుఁ గుతూహల మున్నప్పుడు అది పట్టుప