పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(అప్పుడు చేతిలో నొకయుత్తరము పట్టుకొని గౌరి ప్రవేశించుచున్నది.)

గౌరి – అయ్యా! మీకు టపాలో వుత్తరంవచ్చింది. (అని చేతి కిచ్చి వెళ్ళుచున్నది.)

మతి - ఏమిటీ! వుత్తరమా? ఆగమశాస్త్రవేత్తఅయిన గౌరీపతి శాస్తుర్ల దగ్గరనుంచి కాబోలును. (అని చూచి) కాదుకాదు. ఈవుత్త రం తరువాత నెమ్మదిగా చదువవచ్చునులే. (అని క్రింద పడవేయు చున్నాఁడు.)

సుమ - నాన్నగారూ! మీరు వుత్తరంవిప్పి చదువుకోకుండానే కిందపడవేసినారు. దానిలో యేవయినా జరూరు సంగతులున్న వేమో! నేను విప్పి చదువుదునా? (అని యుత్తరము పుచ్చుకొనిచూచి) దీని మీద పెద్దాపురంముద్రవున్నది. ఇది మామయ్యదగ్గిరనుంచి వచ్చింది వేగిరం చదవండి.

మతి - (ఉత్తరమువిప్సీ చదివి) పిచ్చివాడా? ఇది బాగానే వున్నది. అంతకంతకు పిచ్చిముదిరితే యేమోస్తరుకువస్తుందో? అయినా ఫర్వాలేదు. నేను యోగదృష్టితోచూచి మనోబలం వుప యోగ పరిస్తే యెటువంటివాణ్నయినా నిముషంలో వశపరుచుకో వచ్చును. అతను రావడంతోటే ప్రయత్నంచేసి చూస్తాను. ఇప్పుడు వెళ్ళి వక్కనిముషం ప్రాణాయామంబట్టి మళ్ళీవస్తాసు. (అని యుత్తర మక్కడ పడవైచి వెళ్ళుచున్నాఁడు.)

సుమ - నాన్నగారు వూరికే జపంపిచ్చలో పడిపోయినారు. తిన్నగా వేళకు భోజనానికైనా రావడంలేదు. నేను యీవుత్తరములో యేమివున్నదో చదువుతాను. (అని చదువుచున్నది. “మీ చెల్లలు పోయినప్పటినుంచీ మీ మేనల్లుడికి విచారంచేత బొత్తిగా పిచ్చియెత్తి