పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను పట్టుకోవడానికి కబురు పంపించిన చిన్నవాడుయితడే. నీవుభయపడకుండా గట్టిగాపట్టుకోవలెను.

రాము - మీరుముందు నడవండి. ముసలివారుమీరే భయపడకపోతే నేను భయపడుతునా?

మతి - (రామునితో) నేను యోగదృష్టితో చూచి అతణ్ని కదలమెదలకుండా చేస్తాను. అతడు నిశ్చేష్టితుడై చిత్రపుప్రతిమలాగు వున్నప్పుడు నీవువెళ్ళి పట్టుకోవలెను.

రాము — మీ యోగదృష్టి గీగదృష్టి యేమీ నాకు సహాయం అక్కరలేదు. నేను సిద్ధంగా వున్నాను.

మతి - నేనా కుర్చీ తెచ్చి యితనికి యెదురుగా వేసుకుని కూర్చుంటాను. (అని వెళ్ళుచున్నాఁడు.)

సుబ — (రామునితో) అతడు కుర్చీలో కూర్చోవడంతోటే నీవు వెనుకనుంచి తాళ్ళువేసి వెంటనే కట్టవలెను.

రాము — మంచిది. అలాగేచేస్తాను. ఇయిగోత్రాళ్ళు నాచేతులో సిద్ధంగానే వున్నవి. (అని చూపుచున్నాఁడు.)

మతి - (కుర్చీతెచ్చి సుబలునకెదురుగా వేసికొని కూరుచుండి రెప్పవాల్చక సుబలుని చూచుచు) అబ్బాయీ! జాగ్రతగాకూర్చో. (అని వెనుకతిరిగి రామునికి సైగలుచేయఁగా సుబలుఁడుకూడ సైగలు చేయుచున్నాఁడు.) అబ్బాయీ! నీవు యిందాకా చాలా దురుసుగా వున్నావు. ఇప్పుడు నెమ్మదిపడ్డావనుకుంటాను. (అని రెప్పవాల్చక మరల సుబలుని చూచుచున్నాఁడు.)

సుబ - అవును. (అని కన్నులరమోడ్చి కుర్చీకిఁ జేరగిలఁబడి కూర్చుండి నిద్రపోయినట్టు నటించుచున్నాఁడు.)

మతి - (పెనఁగులాడుచు) ఓరి బుద్ధిహీనుడా! ఇందులో నీవు పొరపాటుపడి వకరినికట్టడానికి, వకరినికట్టినావు.