పుట:మ ధు క ల శ మ్.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్

                     73
వెలదీ ! నీవును నేనునున్ గలసి అన్వేషింపగానేర్తుమే ?
ఇల నాద్యంతవిమర్శదూరమగు నీసృష్ట్యంతరవ్యూహమున్ :
తలమైనన్ తెగగొట్టి తున్కలుగ సంధానింపమే ! దీనిసొం
పెలయన్ గ్రమ్మఱ, నస్మదీయహృదయా భీష్టానుసారంబుగన్.
                       74
మనకై చూచుచునున్నవా డదియె రమ్యస్వర్గచంద్రుండు, కా
మిని ! ఈ తై జసికాంతరాళతరళోర్మిద్వారమార్గమ్మునన్,
తనరారాకల నింక ముందు నను గానన్ లేక యీపుష్పపుం
జనికుంజమ్ముల నాత డెంతటి నిరాశాఖేదమున్ పొందునో.
                       75
పఱచినచుక్కల ట్లతిథివర్గము పచ్చికపై సుఖింపగా,
మెఱుగుపసిండికా ల్గదిపి నీవును పోయెడువేళ, వేడుకల్
విరిసినశూన్యపాత్ర దొరలించితి నేనెట; నా ప్రదేశమున్
దరిసెద వాత్మసాంత్వనవిధాయకయాత్ర ముగించుచున్ సఖీ!

63