పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

మైసూర్‌ పులిటిపూ సుల్తాన్‌

యం.డి. సౌజన్య ప్రముఖ రచయిత, కవి తెనాలి.

పరిచయ వాక్యం విజేతలదే చరిత్ర. పరాజితుల చరిత్ర చాలావరకు ప్రాచుర్యానికి నోచుకోదు. విజయం సాధించిన వర్గాలు ఆనాి అన్ని రంగాలను శాసిస్తాయి. అందువలన సహజంగా విజేతల చరిత్ర అక్షరబద్ధమవుతుంది. పరాజితుల ఆనవాళ్ళు కన్పించకుండ పోతాయి. ఈ పరిణామాలలో విజేతలు పరదేశీయులు, పరాజితులు స్వదేశీయులు అయినట్లయితే, తమ పాలనకు స్థానిక జనసముదాయాల అనుకూలతను సాధించేందుకు పరాజితుల చరిత్రలు ఘోరంగా వక్రీకరించబడతాయి. పాలకవర్గాల లక్ష్యాలకు అనుకూలంగా చిత్రించబడతాయి. చివరకు ఆ వక్రీకరించిన - చిత్రీకరించిన చరిత్రే భవిష్యత్తు తరాలకు చరిత్రగా మారుతుంది. ఆ చరిత్రను భావితరాలు నమ్మాల్సిన పరిసితులు ఎదురవుతాయి. ఈ అవకాశాలను రాజ్యకాంక్షాపరులైన వ్యక్తులు-శక్తులు ఆ తరువాత కాలంలో చాలా తెలివిగా ఉపయోగించుకుంటాయి.

మన దేశంలోని చరిత్ర పలు వక్రీకరణలకు-చిత్రీకరణలకు గురయ్యింది. బ్రిీటిషర్లు మన గడ్డమీద అడుగుప్ర్ట్టి స్వదేశీ పాలకులను పరాజితులనుచేసి అధికారాన్నిచేజిక్కిం చుకుని, ఆరంభించిన పాలనకు స్వదేశీయుల ఆమోద ముద్ర పొందేందుకు పరాజితులైన స్వదేశీ పాలకుల గడచిన కాలంనాటి పాలన అత్యంత క్రూరమైనదిగా పేర్కొంటూ, ఆపాలకులను నిరంకుశులుగానూ, కడు దుష్టులుగాను చిత్రిస్తూ గ్రంథాలు రచించారు. ఈ కార్యక్రమాన్నిఅధికార స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహించేందుకు ప్రముఖ ఆంగ్ల రచయితలను, ఆంగ్లేయాధికారులను,మిషనరీలను ప్రత్యే కంగా నియమించారు, అవసరానికి మించిన ధనసంపదలను నిర్దేశిత లక్ష్యాల కోసం అందజేసి చరిత్రను తిరగరాయించారు. ప్రముఖ ఆంగ్ల రచయిత JS Grewal తన గ్రంథం Muslims Rule in India : The Assement of British Historians, (Oxford University Press, 1970) లో ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ '..British administrators, scholors, historians and missionaries all become seriously involved in making the people believe that Brit-

5

23 21 9