పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ish rule was better than medieval Muslim rule.'అన్నాడు.

ఈ మేరకు భారతదేశంలోగల అధిక సంఖ్యలోగల ముస్లిమేతరుల సమ్మతిసాధించేందుకు సాగిన చరిత్ర వక్రీకరణ - చిత్రీకరణలకు ముస్లిం పాలకులు ప్రదానంగా బలయ్యారు. ఆ విధగా దుష్ప్రచారానికి గురన స్వదేశీ పాలకులలో మైసూరు పాలకుడుటిపూ సుల్తాన్‌ ఒకరు. భరత గడ్డనుండి బ్రిీటిషు పాలకులను తరిమివేయడం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను ముప్పుతిప్పలు పెట్టిన టిపూను ప్రధాన శతృవుగా భావించిన ఆంగ్లేయులు ఆయనను దుర్మార్గుడిగా చిత్రించారు. ఆయన చరిత్రను వక్రీకరించారు. ఆ మేరకు దుష్ట ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని భుజాలమీద మోస్తూ ఈనాటికి కొన్నిమతోన్మాద రాజకీయ శక్తు లు ప్రచారానికి పూనుకుని పనిచేస్తున్నాయి. 1999లో టిపూ సుల్తాన్‌ ద్విశతవార్షికోత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జరపదలపెట్టిన సందర్భంగాటిపూను మతోన్మాదిగా, హిందాూ ద్వేషిగా చిత్రిస్తూ సంఘపరివారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.

అటువంటి కుట్రపూరిత ప్రచారాలను వమ్ముచేయాలంటే వాస్తవాలు బహిర్గతం కావాలి. పదిమందికి తెలియాలి. ఆ దిశగా చరిత్రకారులు కృషి సాగించాలి. మన దేశంలోని విభిన్న జన సముదాయాలు తమ పూర్వీకుల త్యాగాలను తెలుసుకోవాలి. ఆవిధాంగా కలిగిన ఎరుకవల్ల ఆయా సామాజిక సముదాయాల మధ్య సదావగాహన ఏర్పడుతుంది. ఆ సదవగాహన నుండి సద్భావన అంకురిసుంది. ఆ సద్భావన ఫలితంగా సమాజంలో సామరస్యం పటిష్టమౌతుంది. ఆ వాతావరణంలో ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్తలు పరిఢవిల్లుతాయి. ఈ లక్ష్యంతో భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ముస్లింల భాగస్వామ్యాన్ని వివరిస్తూ తెలుగు పాఠకుల కోసం చరిత్ర రచన సాగిస్తున్న సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మైసూరు పులి:టిపూ సుల్తాన్‌ అను మరో గ్రంథాన్ని రాశారు. ఈపుస్తకం పేజీల లెక్కన చూస్తే చిన్నదే అయినా, పుస్తకంలోని అంశాన్నిబేరీజు వేస్తే చాలా బరువైనది కనుక ఈ పుస్తకాన్ని పిట్ట కొంచెం కూత ఘనం అనక తప్పదు.

మాతృభూమి నుండి బ్రిీటిషర్ల తరిమివేతకు పోరుబాటను ఎన్నుకున్నటిపూ సుల్తాన్‌, జాతీయ భావనలతో స్వదేశీ పాలకుల ఐక్య సంఘటన నిర్మించేందుకు ఏ విధాంగా ప్రయత్నించాడో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. ఓయుద్ధ తంత్రనిపుణుడిగా, అసమాన పోరాట యోధుడిగా మాత్రము కాకుండ జనరంజక పాలకుడిగా,సాహిత్య వేత్తగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, పుస్తక ప్రేమికుడిగా, సంస్కర్తగా,లౌకిక ప్రభువుగా, అంతర్జాతీయ వ్యవహార దాక్షుడిగా, రాజనీతి కోవిదుడిగా, మనసున్న మహారాజుగా, వర్తక- వాణిజ్యరంగాలలో నూతన దృక్పధాల ఆవిష్కర్తగా, స్వదేశీ -