పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టి పూ సుల్తాన్‌

శతృవు తన కుయుక్తులకు శ్రీకారం చుట్టాడు. అధికార దాహంతో అక్రమంగా నైనా రాజ్యాధికారం చేప్టాలని ఉవ్విళ్ళారుతున్న అధికారమదాంధాులు ఆపాటికి ఆంగ్లేయులకు దాసోహం ఆనన్నారు. ఈ కుట్రలు, అంతర్గత శత్రువుల ఎత్తులను టిపూ గూఢచారి బలగాలు కనిపెట్టలేక పోయాయి. అత్యంత పకడ్బందీగా సాగిన కుట్ర వివరాలు టిపూకు తెలియలేదు. ఈ కుట్రకు మూలకారకుడు టిపూ దివాన్‌ మీర్‌ సాధిక. అతగాడు రాజ్యకాంక్షతో బ్రిీటిషర్లతో చేతు లు కలిపాడు. టిపూ రాజ్యంలోని మరికొందరు పాలెగాళ్ళు టిపూ మిత్రులుగా నటిస్తూ, బ్రిీటిషర్ల మేలుకోరసాగారు.

శ్రీరంగపట్నం కోట గోడలను విద్వంసం చేయడానికి ఆంగ్లేయ కూటమి శత విధాల ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో అంతర్గత శతృవు మీర్‌ సాధిక్‌ రంగంలోకి వచ్చాడు. ఆంగ్లేయాధికారులకు, కంపెనీ సైనికులకు కోట గోడలు బలహీనంగా ఉన్న ప్రాంతాన్నితెలియచేసూ, టిపూ ప్రాసాదానికి సమీపానున్నవాటర్‌గేటు ద్వారా కోటలోనికి ప్రవేశించటం సులువన్నరహస్యాన్ని శతృవుకు చేరవేశాడు. టిపూ ప్రాసాదానికి వాటర్‌ గేటు చాలా సమీపాన ఉంది. అక్కడ టిపూ సైనికులు ఎంతో జాగ్రత్తతో పహరాకాస్తున్నారు. ఆ సైనికులను అక్కడ నుండి తొలిగించి, ఆంగ్లేయ సైన్యాలను కోటలోకి

మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf
శ్రీరంగపట్నం ముఖద్వారం వద్ద టిపూ సుల్తాన్‌ మృతి చెందిన స్థలం
                     55