పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

తేలిగ్గా ప్రవేశింపచేసేందుకు మీర్‌ సాధిక్‌ కుట్ర పన్నాడు. అక్కడ పహరాకాస్తున్న సైనికులకు జీతాలు చెలిస్తు న్నారని అసత్యాలు చెప్పి , ఆ కీలక ప్రాంతం నుండి తప్పించాడు. ఆలోగా శత్రు సైనిక బలగాల ఫిరంగులు కోట గోడను మరింత బలహీనపర్చాయి. మీర్‌ సాధిక్‌ శతృసైనికులకు స్వాగతం పలుకుతూ కోటలోకి మార్గం చూపాడు.

మీర్‌ సాధిక్‌ స్వామి ద్రోహం వలన ఆంగ్లేయ సైన్యాలు ఎటువంటి ప్రతిఘటన లేకుండ వాటర్‌ గేటు గుండా కోటలోకి జొరబడ్డాయి. శతృ వు కోటలోకి ప్రవశించటంతో టిపూ సైన్యాలలో కలకలం ప్రారంభమైంది. ఆ అదను కోసం ఎదురు చూస్తున్న మీర్‌ సాధిక్‌ తన పని పూర్తయ్యిందన్న తృప్తితో కోట నుండి తప్పించుకొని రహస్య మార్గం ద్వారా బయటపడి ఆంగ్లేయ యజమానులను చేరేందుకు త్వరపడుతూ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.

బ్రిీటిష్‌ సెన్యం అన్ని వైపుల నుండి టిపూను చుట్టుముట్టింది. ఆ క్లిష్ట సమయంలో అందలం ఎక్కాలన్న దాురాశతో స్వామిద్రోహానికి పాల్పడిన మీర్‌ సాధిక్‌ కోట నుండి ఆంగ్లేయ శిబిరంలోకి జారుకుంటూ, టిపూ సుల్తాన్‌కు నమ్మినబంటు అయినటువింసైనికాధికారి శ్రీ కృష్ణారావు కంటబడ్డాడు. మీర్‌ సాదిఖ్‌ ప్రవర్తనను అనుమానించిన శ్రీ కృష్ణారావు అతనిని తన దగ్గరికి పిలిచారు. టిపూ సుల్తాన్‌ కోట బయటకు పంపుతున్న ఓ రహస్య సందేశం తన వద్దా ఉందని, దానిని శతృవు చేతికి చిక్కనివ్వకుండ బయటకు పంపాలని మీర్‌ సాధిఖ్‌కు నమ్మబలికారు. ఆ రహస్య సందేశం ఏమిటో తెలుసుకోదలచిన స్వామిద్రోహి తిన్నగా కృష్ణారావును సమీపించాడు. ఆ ప్రయత్నంలో కృష్ణారావుకు కత్తివేటు దూరానికి మీర్‌ సాధిఖ్‌ రాగానే ఒక్కదాటన పైకి ఎగిరిన కృష్ణారావు, సుల్తాన్‌ శత్రువు ముట్టడిలో చిక్కుబడిపోతే నువ్వెక్కడికిరా పోతున్నావు? ద్రోహీ' అంటూ తన కత్తిని సాధిఖ్‌ గుండెల్లో దించాడు. అంతటితో ఆ స్వామిద్రోహి మీర్‌ సాధిఖ్‌ బ్రతుకు అంతమైపోయింది.

ఈ విధాంగానే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1757లో బెంగాలు సవాబు సిరాజుద్దౌలాకు ద్రోహం చేసిన మీర్‌ జాఫర్‌ లాగే, 1799లో మీర్‌ సాధిఖ్‌ స్వామి ద్రోహానికి పాల్పడి పరాయి పాలకులకు సహకరించడం చారిత్రక విషాదం. అనాడు మీర్‌ జాఫర్‌ స్వామి ద్రోహానికి పాల్పడినందున వలసపాలకులు ఈ గడ్డ మీదా స్థిరంగా కాలు మోపగలిగారు. ఈసారి మీర్‌ సాధిక్‌ అటువంటినీచానికి పాల్పడి కంపెనీ పాలకులు ఈ గడ్డ మీద గట్టిపునాదాులు నిర్మించుకునేందుకు సహయపడ్డాడు. 56 30