ప్ర థ మా శ్వా స ము.
57
యోగవితతికి నానంద ముదయమందె
వేడ్క దనుజాతి హరణప్రవృత్తి యనుచు
సకలజగములు గణుతింప సరసరీతి
భూరిగతిఁ బొల్చు మాధవాభ్యుదయమహిమ.237
శా॥ శ్యామాళుల్ పురుషవ్రజంబు సుమనోవ్యాప్తిన్ ఫలశ్రీలచే
నామోదింపఁగ నమ్మహావనివిభుండై మాధవుండొప్పె నౌ
శ్యామాళుల్ పురుషవ్రజంబు సుమనోవ్యాప్తిన్ ఫలశ్రీలచే
నామోదింపఁగ నమ్మహావని విభుండై మాధవుం డొప్పడే. !238
కం॥ పేరు వహించి వసంతుఁడు
సౌరభ్యము గాంచఁ దత్ప్రసవసంతతియున్
సౌరభ్యము గాంచెను భళి
యారయ సత్పురుషకులము లట్టివె కావే !239
సీ॥ కలరవంబుల రకంబులఁ బికంబులు గేరె
రమణఁ గీరములు బేరములు బారె
పొదలు పూఁబొదలు సంపదల సొంపలరారె
జాత భీతిని జాతిరీతిదారె
పొలుపొంద సుమబృందముల మరందము లూరెఁ
దద్బిందువుల మిళిందములు సేరె
మరుహేతి విరహిమర్మములు బిమ్మర దూఱె
శమనదిగ్వాతపోతములు వాఱె
రవి రవళిదేరె పథికధైర్యములు జాఱెఁ
దాప మేపారె జనము శీతలము గోరె
సుమరజము గూరె వనవిహారములు మీఱె
మాఱె శిశిరంబు బెంపారె మధుదినంబు.240