పుట:మీగడతరకలు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఎదురుగా వచ్చి రాపులుఁ గిట్టు లనియె!
అవుర ! యెంతటి మోసకాఁడవుర నీవు ?
మంచిమాటల నన్ను నమ్మంగఁ బలికి
నాదుబిడ్డలఁ జంపంగ న్యాయ మగునె ? ”

"నీదుబిడ్డలు లే విందు నిక్కముగను,
నేడు చంపిన పిట్టలన్నింటియందు
అంద మగు పిట్ట యొక్కటి యైన లేదు;
నీవె చూడుము నామాట నిజమొ , కాదొ! "

"ఇంతమాత్రమె మూర్ఖుఁడా యెఱుఁగ వైతి,
వవనియందలి సర్వవస్తువులలోన
తనదుబిడ్డలె యధిక సౌందర్యవంతు
లనుచు మనమునఁ దలఁపని జనని గలదె?"

27