పుట:మీగడతరకలు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



పక్కు మని నవ్వి యతనితో పక్కి యనియె:
“ ఔర ! మృగయుఁడ ! యెంత మాటాడినావు ?
పులుఁగుజాతుల నిన్నాళ్లు మెలఁగుచుండి
అడిగెద వె నాదుబిడ్డల యానవాలు ?

"జగములందలి బహువిధఖగము లెల్ల
నాదుబిడ్డలతోడ సౌందర్యమందు
సాటివచ్చునె? కాన నోవేఁటకాఁడ!
వాని నవలీల పోల్పఁగవచ్చు నీకు. "

"పెక్కుమాట లిఁ కేల ! ఓపక్కిఱేడ!
వినుము చెప్పెద- నీబిడ్డ లనఁగ నేల ?
సుందరం బగు పక్షులజోలిఁ బోవ
నంచు నే నిదె బాస గావించువాఁడ. "

అనుచు వచియించి యాతఁడు వనములోని
"కేగి, దిన మెల్ల పక్షుల నెన్నొ కూల్చి,
వాని నన్నిటి నొక త్రాట వరుసఁ గూర్చి
తరలి వచ్చుచునుండె నాదారి వెంట.

26