పుట:మార్కండేయపురాణము (మారన).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శ్రీకీర్తివిజయనిత్యా!, లోకజనస్తుత్య! మర్త్యలోకాదిత్యా!
స్వీకృతసంతతసత్యా!, శ్రీకంఠశ్రీశభృత్య! శ్రీకరకృత్యా!

289


మాలిని.

ప్రలలితబుధకామా! భామినీచిత్తధామా!
కులజలనిధిసోమా! కోవిదస్తుత్యనామా!
బలవదహితభీమా! బాహువీర్యాభిరామా!
విలసితగుణభామా! విస్ఫురత్కీర్తిదామా!

290


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహాపురా
ణంబునందుఁ బ్రాంసుచరితంబును ఖనిత్రచరిత్రంబును క్షుపోపాఖ్యానంబును వీర
నృపసంభవంబును వివింశోపాఖ్యానంబును ఖనిత్రనేతృచరితంబును గరంధమో
పాఖ్యానంబును నవేక్షితచరితంబును మరుత్తోపాఖ్యానంబును నను కథలం గల
యష్టమాశ్వాసంబు సర్వంబును సంపూర్ణము


ఆ.

చచ్చెనేని యోగిచాడ్పున ముక్తికి
పాఱిపోయినయంతనే బ్రతుకు లేదు
బ్రతికెనేని యుభయబలములుఁ బొగడంగ
నుండు సమరకేళి యొప్ప దెట్లు.

సకలనీతిసమ్మతము 934

చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము.