పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నిస్తే 1948 లో శ్రీ పట్టాభి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. ఆ ఉన్నత పీఠాన్ని తెలుగు వాడైన పట్టాభి అధిరోహించటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. అప్పుడా మహనీయుని చిత్రాన్ని ఇండియా నుంచి తెప్పించుకుని ఇంట్లో అలంకరించుకున్నాను అని శ్రీ సోమయ్య చెప్పారు.

మారిషస్ తెలుగు ప్రముఖుల్లో శ్రీ సోమయ్య చక్కగా తెలుగు మాట్లాడాడు. ఎదనంతా తెలుగు అభిమానం నింపుకున్న వ్యక్తి. శ్రీ సోమయ్య కుటుంబం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వెళ్ళటం వలన ఇంట్లో లేరు. ఆయనే పాలుకాచి, బిస్కెట్టు ఇచ్చి అతిధి మర్యాద చూపించారు. శ్రీ సోమయ్యకు రెండు చక్కని డాబాలు, కోళ్ళ ఫారం ఉన్నాయి.

హైద్రాబాద్ లో మతకల్లోలాలు రేగి చాలామంది చనిపోయినట్టు వార్తలు మారిషస్ లో ఉన్న మాకు తెలిసింది. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా హైద్రాబాద్ లోని శాంతి భద్రతల పరిస్థితి మమ్మల్ని ఆంబోళన పరచింది. శ్రీ సోమయ్యగారింటి నుంచి హైద్రాబాద్ కి ఫోన్ చేసి మా బావ డా॥ చంద్రశేఖర్ తో మాట్లాడిన తరువాత మా మనసులు కుదుట పడ్డాయి.

ఇటీవలి కాలంలో శాంతి సామరస్యాలతో విలసిల్లుతున్న హైద్రాబాద్ నగరంలో తిరిగి మతోన్మాద కరాళ రక్కసి విలయతాండవం చేసి దాదాపు 100 మందిని పాట్టన పెట్టుకోవటం-నగరం కర్ఫ్యూ నీడలో బోసి పోవటం" భయంలో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించబం సభ్యసమాజానికి సిగ్గుచేటు.

'భాష' సదస్సు

డిశెంబర్ 11వ తేదీన మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్లో సదస్సులు జరిగాయి. భాషపై జరిగిన సదస్సులో డా॥సి.నారాయణరెడ్డిగారు, శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు.

దక్షిణాఫ్రికాలో ఆంధ్రులలో తెలుగు భాషకు గల స్థానం గురించి శ్రీమతి వారిజా ప్రభాకర్ (దర్బన్ యూనివర్శిటీ, దక్షిణాఫ్రికా) ప్రసంగిస్తూ దక్షిణాఫ్రికాకు తెలుగువారి వలస 1860 లో ప్రారంభం అయ్యిందని, 1989 లో దేశజనాభాలో భారతీయులు మూడోశాతం ఉండగా దానిలో తెలుగువారు 10 వ శాతం ఉన్నారని తెలిపారు.

పిష్ మెన్ సిద్ధాంతం ప్రకారం వలసదారులు మొదటిదశలో తమ మాతృభాషద్వారా ఇంగ్లీషు నేర్చుకుంటారని, రెండవదశలో ఎక్కువమంది ఇంగ్లీషు నేర్చుకుని పరస్పర సంభాషణలలో ఇంగ్లీషు, మాతృభాష ఉపయోగిస్తారని,