పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వారికి ఒక అబ్బాయి. మేము మారిషన్ కు వచ్చే కొద్ది రోజుల ముందే శ్రీ అర్జా రామారావుగారి సతీమణిహృద్రోగంతో హఠాత్తుగా మృతిచెందారు. తల్లి శ్రాద్ధకర్మలకు శ్రీమతి లక్ష్మీ రాలేకపోయింది

శ్రీ త్యాగరాజ్ మారిషస్ గణాంక శాఖలో పనిచేస్తున్నారు. శ్రీ త్యాగరాజ్ తో కలసి వారింటికీ వెళ్ళి శ్రీమతి లక్ష్మిని పరామర్శించి విజయవాడ విశేషాలు తెల్పాము. త్యాగారాజ్ ఇటీవలె చక్కటి డాబా ఒకటి నిర్మించుకున్నారు.

ఆ రోజు రాత్రి రామసుందర్ ప్రయాగ్ లోని స్టేట్ సెకండరీ స్కూల్లో మన సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలు జరిగాయి. మన కళాబృందాలు రెండు భాగాలుగా చీలి మారిషన్ లోని గ్రామప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రయాగలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలకు ఆ ప్రాంతంలోని తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరయినారు. మహిళలు తిలకం దిద్ది సాదరంగా ఆహ్వానించారు.

ఆనాటి సాంస్కృతిక ప్రదర్శనల్లో మలేషియా తెలుగు కళాకారుడు శ్రీ గణేశన్ భరతనాట్య ప్రదర్శన కనువిందు చేసింది. మలేషియాలోని తెలున్ ఇన్ టాక్ లోజన్మించిన శ్రీ గణేషన్ ఉన్నత విద్యాభ్యాసానికి మద్రాసు వచ్చి, తనలో నిగూఢంగా ఉన్న కళాప్రతిభ వెన్నుతట్టగా కలైమణి కె.జె.సరస వద్ద భరతనాట్యం అభ్యసించారు. భారతదేశంలో ఉన్న 8 సంవత్సరాలలో భరతనాట్యంలోనూ, కర్నాటక సంగీతం లోనూ నిష్ణాతులైనారు. దక్షిణభారతదేశంలో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. నాట్యాచారుడై సినీనటి రోహిణికి గురువైనారు. మలేషియా తెలుగు అసోసియేషన్ తమ ప్రతినిధి వర్గంలో ఒక ప్రతిభావంతుడైన కళాకారుడును తీసుకురావటం ముదావహం.

రిటైర్డు తెలుగు ఉపాధ్యాయుడు శ్రీ సోమన్న సోమయ్య ఆ గ్రామస్ధుడు. తెలుగు అంటే ప్రాణం కంటే అధికం ఆయనకు. అంతర్జాతీయ తెలుగు సంస్థ మారిషస్ తెలుగు ఉపాధ్యాయులకు రిఫ్రెషింగ్ కోర్స్ హైద్రాబాద్ లో నిర్వహించినప్పుడు ఆయన మన రాష్ట్రానికి వచ్చారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా వచ్చారు. అప్పటి నుంచి వారు మాకు ఆత్మీయులు అయ్యారు. శ్రీ సోమయ్య మమ్మల్ని వారింటికి తీసుకుని వెళ్ళారు. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి రంగుల ఫోటో గోడకు అలంకరించబడి ఉంది. ఒక్క క్షణం ఆశ్యర్యం-ఆనందం మా మనసుల్ని ముసురు కొన్నాయి.

శ్రీ పట్టాభి ఫోటో మాకే దొరకటం లేదు, మీకెలా లభ్యం అయ్యిందని