పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

మహాభారతతత్త్వ కథనము

సూకరాదులకు భక్ష్యమగు శరీరమునిమిత్తము సామరులు నిత్యము పరుల ప్రాణములుకూడ పుచ్చుకొనుచుందు రని చెప్పబడినది. దాని వలన తామసప్రాణులు కష్టతరమైన గతి నొందుదు రని చెప్పి నిషయ భోగములందు విరక్తి పహింపవలె నను శ్రుత్యర్థము వివరింపబడినది. ఇట్లే ముందు కూడ నాయా ఆఖ్యానముల తాత్పర్య మూహించి రాజనసాత్త్వికప్రాణుల గతి పరిశీలింపదగినది. ముందు ప్రతిప్రకరణ మునకు తాత్పర్యము చెప్పబడుచుండుటవలన నిచ్చట గ్రంథవిస్తర భీతిచే వివరింపబడలేదు అని యా నీలకంఠీయముసకు భావము. ఈవిధ మున జూడగా వేదవ్యాసకర్తృకమైన మహాభారతము- బ్రహ్మవిద్యా ప్రతిపాదనమున ముఖ్యతాత్పర్యము కలదై , తత్ప్రాప్త్యుపాయాదులను సుబోధ మగుటకు ఆఖ్యాయికాముఖమున వెల్లడించుచున్న దగుటచే నాయాస్థలములలోని తాత్పర్యవిశేషములు విద్వద్వ్యాఖ్యానమూల ముననే గjహించి శ్రేయస్కాము లానందింపవలసినది. పర్యవసాన మేమనగా___

"వేదా నధ్యాపయామాస మహాభారత పంచమాన్"

అనుటనుబట్టి వేదవ్యాసమహర్షి శిష్యులగు వైశంపాయనాదులు ఆమహర్షి కృతమైన మహాభారతమునే మహర్షి యొద్ద జదువుకొని యుం డుటచేతను, జనమేజయసర్పసత్రములో దర్శన మిచ్చిన వ్యాస మహర్షిని కురుపాండవచరిత్రము నీవలన వినదలచి యుంటినని జనమే జయుడు ప్రార్థింప

“తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణద్వపాయన స్తదా !
శశాస శిష్య మాసీసం వైశంపాయన మన్తికే |
కురూణం పాండవానాం చ యథా భేదో౽ భవత్పురా |
తదస్మై సర్వ మాచక్ష్వ య న్మత్తశ్శ్రుతవా నసి ||
గురో ర్వచన మాజ్ఞాయ న తు విప్రర్షభ స్తదా |