పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

47

బడినదని సమాధానము మనము చెప్పుట సులభమే. ఇట్లు వారు చెప్పిన కారణము లన్నియు విగళితము లైనవి. విఘ్నేశ్వరుడు లేఖకుడే యని స్థిరపడినది. ఆగాధ ఇటీవల కల్పింపబడినది కాదు.అనుటకు మరియొక నిదర్శన మున్నది.

అతిప్రాచీనుడైన రాజశేఖర కవి. 'బాలభారతము' అను తన గ్రంథమున భారత సంహితకు గణపతి లేఖకుడని వ్యాసవాల్మీకిసంవా దములో వ్యాసునిచే జెప్పబడినట్లు వ్రాసెను. చూడుడు! ----

వాల్మీకి :

వత్స! కృష్ణ ద్వైపాయన! కస్య పునః కవే ర్వాచః భారతస్య షోడళీ మపి కలాం కలయన్తి | యతః ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ!, యదిహాస్తి దన్యత్ర యన్నేహాస్తి న త త్క్వచిత్ ' ... కిన్తు శ్రుత మాస్మాభి ర్యదు తాతివిరసే కావ్యకష్టె౽ భినివిష్టోసి| వ్యాసః- ఇద ముపా ధ్యాయపాదేభ్యో విజ్ఞాప్యతే | వినాయకో య శ్శివయో రప త్య మర్థం పుమా నర్థ మిభశ్చ దేవః | స వర్తతే భారతసం హితాయాం వృత స్తపోభి ర్మమ లేఖకోత్ర తేన చ ఛలయ తు మహ ముపక్రాన్తః, యదుత బాఢ మహం తే లిపికారః కిం పున ర్యేన రంహసా లిఖేయం తేన యది న సందృభసే త త్తే విఘ్న స్స్యాత్ | తతో మయోపి ప్రతిచ్ఛలితః ఓమి త్యస్తు | కిం పున ర్భవతా భావయతా లిఖితవ్య మితి | అతః కావ్యకష్టె౽భినివిష్టోస్మి |

ఇట్లు వ్యాసమహర్షి కఠిన శైలిలో శ్లోకములు చెప్పుటకు హేతువు గణపతి యర్థము చేసుకొనునపుడు వ్రాతలోని వేగము తగ్గించుటకే యని చెప్పెను.