పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మహాభారతతత్త్వ కథనము

ఈవిధముగా మహాభారతమం దున్న గణేశవృత్తాంతమునే భంగ్యంతరమున తన గ్రంథ ముందు ప్రతిపాదించిన యీ రాజశేఖర కవి కాలము ఆ బాలభారతోపోద్ఘాతములో నిట్లు చెప్పబడెను.

"అథచ 881 మితే శకే 959 మితే వా ఖస్తాబ్దే జైనసోమ
దేవేన యశస్తిలక చంపూః ప్రణీతా| తత్ర తృతీయాశ్వాసే
మాఘాదికవినామసు రాజశేఖరస్యాపి నామ వర్తతే| తస్మా
త్తత్కాలాత్ప్రాచీనో రాజశేఖరః!?"

అనగా క్రీ. శ. 959 సంవత్సరములో జైనసోమ దేవునిచే రచింప బడిన యశస్తిలక చంపులో మాఘాదికవుల నామములలో రాజశేఖర కవి నామము కూడ తృతీయా శ్వాసములో పేర్కొనబడుటచే అంతకు వెనుక కాలము రాజశేఖరకవిది. అని తాత్పర్యము. ఈ నిర్ణయమునుబట్టి ఇప్పటికి వేయిసంవత్సరములకు పూర్యుడు రాజశేఖరకని. ఆతడు కూడ గణేశవృత్తాంతమును చెప్పినాడు. కనుక విఘ్నేశ్వరుడు లేఖకుడే.

ఇట్లు అనేకకర్తృత్వనిరాకరణప్రస్తావములో ప్రసక్తానుప్రసక్త ముగ ప్రాప్తించిన గణేశలేఖకత్వవిషయము నందలి అక్షేపములు పరిహరింపబడినవి ఇక ప్రకృతము నందుకొందము...

(7) మహాభారత మీమాంసా కారులు మఱియొకపద్ధతిని కర్తృ భేదము నిరూపించిరి – “ముందు వ్యాసమహర్షి 100 పర్వము లను రచించెను. పిమ్మట సూతపుత్రుడు రౌమహర్షణి నైమిశా రణ్యమందు 18 పర్వములను మాత్రము పఠించెను ----

“ఏతత్పర్వశతం పూర్ణం వ్యాసే నోక్తం మహాత్మనా !
యథావ త్సూతపుత్రేణ లౌమహర్షణినా తతః
ఉక్తాని నైమిశారణ్యే పర్వాణ్యష్టాదశైవ తు ” (ఆది, అ2 .)